డబుల్ ధమాకా..!
15-05-2017 03:04:01
కరువుదీరా పండిన మినుములు
దేశమంతా పంటలే పంటలు
హైదరాబాద్, మే 14 (ఆంధ్రజ్యోతి): దేశంలో కరవుదీరా పంట పడింది. ప్రకృతి సహకరించడంతో ఈ ఏడాది ఆహార ధాన్యాల దిగుబడి గణనీయంగా పెరగబోతున్నాయి. అన్ని రాష్ట్రాలలోనూ వ్యవసాయ ఉత్పత్తులు పెరుగుతుండగా తెలంగాణలో కొన్ని పంటలు అసాధారణ పెరుగుదల రేటు నమోదు చేస్తున్నాయి. 2016-17 వ్యవసాయ సంవత్సరంలో దిగుబడులకు సంబంధించి మూడో అంచనాలను కేంద్రం తాజాగా విడుదల చేసింది. 2015-16తో పోలిస్తే అన్ని రకాల ఆహారోత్పత్తులు కలిపి రెండు కోట్ల టన్నులకు పైగా అధికంగా పండబోతున్నాయి. 2015-16లో దేశవ్యాప్తంగా 9.1 కోట్ల టన్నుల వరిధాన్యం ఉత్పత్తికాగా అది ఇప్పుడు 9.6 కోట్ల టన్నులకు పెరగబోతోంది. గోధుమలు 9.2 నుంచి 9.7 కోట్ల టన్నులకు పెరుగుతోంది. ఆహార, చిరుధాన్యాలు కలిపి 2015-16లో 25.1 కోట్ల టన్నులు ఉత్పత్తి కాగా తాజా అంచనాల ప్రకారం 2016-17లో 27.3 కోట్ల టన్నులకు పెరగబోతోంది. నూనె గింజల ఉత్పత్తి 85 లక్షలు టన్నుల నుంచి 97 లక్షల టన్నులకు పెరగబోతోంది. జాతీయ సగటుతో పోలిస్తే తెలంగాణలో వ్యవసాయోత్పత్తుల పెరుగుదల రేటు అధికంగా ఉంది. వరిధాన్యం ఉత్పత్తి 82ు మేర పెరుగుతోంది. కంది ఉత్పత్తిలో ఏకంగా 135ు పెరుగుదల నమోదైంది. మినుముల ఉత్పత్తి కూడా తెలంగాణలో భారీగా 127ు మేర పెరుగుతున్నాయి. ప్రభుత్వం నిరుత్సాహపరచడంతో పత్తి ఒక్కటే ఉత్పత్తి 21ు తగ్గుతోంది. దాంతో పత్తి రైతులకు మంచి ధర లభిస్తోంది. ఏపీలో పరిస్థితి కొంత భిన్నంగా ఉంది. బియ్యం ఉత్పత్తి కేవలం 4.6ుపెరుగుదల నమోదైంది. వేరుశెనగ 28.5ు, చెరకు 21.8ు మేర తగ్గుదల నమోదు అయ్యాయి. మిర్చి మాత్రం ఏకంగా 42.9ు అధికంగా ఉత్పత్తి అవుతోంది. వేరుశెనగ ఏపీలో తగ్గితే తెలంగాణలో పెరిగింది.