పోలవరం పూర్తి కావాలి!
18-10-2017 03:05:53
రేట్లు పెంచుతారా.. కాంట్రాక్టరును మారుస్తారా మీ ఇష్టం
పనులు వేగంగా జరగడమే మా అభిమతం
పాత రేట్లతో పనులు చేయలేని పరిస్థితి
కాంట్రాక్టు సంస్థ ఆర్థిక స్థితి బాగోలేదు
మా ఉద్దేశం అర్థం చేసుకుని సహకరించండి
గడ్కరీకి ముఖ్యమంత్రి చంద్రబాబు వినతి
స్వయంగా నాగపూర్ వెళ్లి మంత్రితో చర్చలు
ఈనెల 24, 25 తేదీల్లో చర్చిస్తామన్న గడ్కరీ
పోలవరం పూర్తికి సంపూర్ణ సహకారంపై హామీ
అమరావతి, అక్టోబరు 17 (ఆంధ్రజ్యోతి): పోలవరం ప్రాజెక్టుకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తామని, దీని పూర్తికి సహకరిస్తామని కేంద్ర జలవనరుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు హామీ ఇచ్చారు. పోలవరం ప్రాజెక్టు పూర్తయితే.. మహానది- గోదావరి - కావేరీల అనుసంధానం చేయాలన్న ఆలోచనలో ఉన్నామన్నారు. మహారాష్ట్రలోని నాగపూర్‌లో గడ్కరీని సీఎం చంద్రబాబు, మంత్రి దేవినేని ఉమా, ఇతర అధికారులు కలిశారు. ‘పోలవరం కాంట్రాక్టరును మార్చలేం. ఇప్పుడు మార్చితే అదనపు భారం పడుతుంది’ అని గడ్కరీ పేర్కొన్నట్లు మంగళవారం వార్తలు రావడం... అటు, కేంద్ర జలవనరుల శాఖ అధికారులు కూడా ఇదే అభిప్రాయంతో ఉన్నట్లు తెలియడంతో సీఎం ఆగమేఘాల మీద స్పందించారు. విశాఖ నుంచి నేరుగా ఢిల్లీ వెళ్లాల్సిన ఆయన... అప్పటికప్పుడు గడ్కరీ వద్ద సమయం తీసుకుని, నాగపూర్‌కు
వెళ్లారు. గడ్కరీతో గంటా 40 నిమిషాలపాటు చర్చించారు. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి చోటు చేసుకున్న పరిణామాలను పూసగుచ్చినట్లు వివరించారు. ‘‘2018నాటికి గ్రావిటీ ద్వారా నీళ్లివ్వాలని, 2019 ఎన్నికల నాటికి ప్రాజెక్టును పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఇప్పుడు వర్షాలు తగ్గుముఖం పట్టినందున పనులు వేగిరం చేయాలి. లేకుంటే... ఒక నీటి సంవత్సరం వృథా అవుతుంది. పనుల అంచనాలన్నీ పెరిగాయి. కానీ, ప్రధాన కాంట్రాక్టు సంస్థ చేసుకున్న ఒప్పందం మేరకు ధరలు పెంచేందుకు వీలు లేని పరిస్థితి నెలకొంది. అప్పటి స్టాండర్ట్ షెడ్యూల్డ్ ధర (ఎస్‌ఎ్‌సఆర్)ల మేరకు ప్రధాన కాంట్రాక్టు సంస్థ పనులు పూర్తి చేయలేదు. కాంట్రాక్టు సంస్థ ఆర్థిక పరిస్థితి కూడా బాగలేదు. దీనివల్ల పనులు మందకొడిగా జరుగుతున్నాయి. ట్రాన్స్‌ట్రాయ్‌కి బ్యాంకులు కూడా రుణాలు ఇచ్చేందుకు ముందుకు రావడం లేదు. పాత ఎస్‌ఎ్‌సఆర్ ధరలతో పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయడం కష్టం. అందువల్ల కొత్త సంస్థను ఎంపిక చేయాల్సిన అవసరం వచ్చింది’’ అని చంద్రబాబు వివరించారు. ఈ ప్రాజెక్టును సకాలంలో పూర్తి చేయడమే తన లక్ష్యమని... ఏ కొద్ది పాటి సమస్య వచ్చిన వెంటనే పరిష్కరించుకోవాలన్న కృత నిశ్చయంతో ఉన్నానని వెల్లడించారు. తాను పది రోజుల పాటు విదేశాలకు వెళ్తున్నందున, ఆ సమయంలో పోలవరం పనులకు ఆటంకం కలుగకూడదనే నాగపూర్‌కు స్వయంగా వచ్చానని గడ్కరీకి చెప్పారు. పనులను వేగంగా పూర్తి చేసేందుకు ఆయన ముందు కొన్ని ప్రతిపాదనలను పెట్టారు. అవి... 1) ప్రస్తుతం కాంట్రాక్టు పనులు చేస్తున్న ప్రధాన సంస్థను పక్కకు తప్పించి.. ఈ-టెండర్లను పిలిచి కొత్త వారితో పనులు చేపట్టడం. అదే జరిగితే... ప్రస్తుత కాంట్రాక్టు సంస్థకు కొంత ప్రయోజనం కలిగేలా చూడాలి. 2) ప్రస్తుత కాంట్రాక్టర్‌కే ఇప్పుడున్న స్టాండర్ట్ షెడ్యూల్డ్ ధరలు వర్తింప చేయడం. ఈ ప్రతిపాదనలు విన్న గడ్కరీ.. కేంద్ర జల వనరుల మంత్రిత్వ శాఖ అధికారులు చేసిన సూచననూ ప్రస్తావించారు. దీనిప్రకారం ప్రాజెక్టుకు అవసరమైన మెటీరియల్‌ను ప్రభుత్వమే సరఫరా చేస్తుంది. లేబర్‌ను మాత్రం కాంట్రాక్టుకు ఇస్తారు.
మీ శ్రద్ధ అర్థమైంది: గడ్కరీ
తనను కలిసేందుకు హుటాహుటిన నాగపూర్‌కు వచ్చారంటేనే పోలవరం ప్రాజెక్టుకు ఎంత ప్రాధాన్యం ఇస్తున్నారో తనకు అర్థమవుతోందని చంద్రబాబుతో గడ్కరీ అన్నారు. జల వనరుల శాఖ మంత్రిగా ఇటీవలే బాధ్యతలు చేపట్టినందున... తనకు పూర్తిగా అవగాహన రాలేదని చెప్పారు. పోలవరంపై ఉన్న ప్రతిపాదనలపై ఈ నెల 24, 25 తేదీల్లో ఢిల్లీలో జల వనరుల శాఖ కార్యదర్శులు, ఉన్నతాధికారులతో సమావేశమై పోలవరం ప్రాజెక్టును యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చిస్తానని గడ్కరీ వివరించారు. పోలవరం ప్రాజెక్టును తాను స్వయంగా చూశానని .. ఈ ప్రాజెక్టు పట్ల చూపుతున్న శ్రద్ధనూ గమనించానని అన్నారు. పోలవరం ప్రాజెక్టుపూర్తికి 100 శాతం సహకారం ఉంటుందని గడ్కరీ అన్నారు. నర్మదా సరోవర్ డ్యామ్ ప్రారంభోత్సవం సమయంలో పట్టిసీమ ద్వారా నదుల అనుసంధానానికి ఏపీ సీఎం చంద్రబాబు శ్రీకారం చుట్టారంటూ ప్రధాని మోదీ కితాబు ఇవ్వడాన్ని గడ్కరీ ప్రస్తావించారు.
పోలవరంపై మరో కమిటీ
పోలవరం ప్రాజెక్టును సత్వరమే పూర్తిచేయడంలో భాగంగా ప్రధాన కాంట్రాక్టు సంస్థ ట్రాన్స్‌ట్రాయ్ నుంచి కొన్ని పనులను తప్పించి కొత్త సంస్థకు అప్పగించడం, అంచనాల పెంపుపై అధ్యయనం చేసేందుకు మరో కమిటీని నియమించాలని కేంద్ర జల వనరుల శాఖ నిర్ణయించింది. ఈ కమిటీని ఒకటి రెండు రోజుల్లోనే వేస్తామని రాష్ట్రప్రభుత్వానికి హామీ ఇచ్చింది. సోమవారం ఢిల్లీలో ఏపీ ఈఎన్‌సీ ఎం.వెంకటేశ్వరరావు.. కేంద్ర జలవనరుల కార్యదర్శి అమర్జిత్‌సింగ్‌తో పాటు ఆ శాఖ ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు.

No comments:
Post a Comment