పంటల బీమా పరిహారం విడుదల
22May 25 2021
అమరావతి: వైయస్సార్ పంటల బీమా చెల్లింపుల కార్యక్రమాన్ని సీఎం జగన్ మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ 15.15 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ. 1820.23 కోట్లు జమ చేసినట్లు చెప్పారు. అలాగే ఖరీఫ్‌లో పంట నష్టపోయిన రైతులకు పరిహారం ఇస్తున్నట్లు తెలిపారు. నేరుగా రైతుల ఖాతాలోకి పంట బీమా పరిహారం జమ అవుతుందన్నారు. రైతులు, రైతు కూలీలు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందన్నారు. 23 నెలల కాలంలో రైతులకోసం రూ.84 వేల కోట్లు ఖర్చు చేసినట్లు చెప్పారు. రైతును ఆదుకునేందుకే పంటల బీమా పథకం తీసుకొచ్చామమని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు.
No comments:
Post a Comment