పంచాయితీ వద్దు
16-02-2017 01:16:00
కోర్టుల్లో కాదు, కూర్చుని చర్చిద్దాం.. మా వాటా ప్రకారమే వాడుతున్నాం
ఆంధ్రలో అక్రమంగా కట్టుకుంటున్నారు.. మా వాటికి అడ్డుపడుతున్నారు
వేల టీఎంసీలు పోతుంటే 50 టీఎంసీలకు గొడవ పెట్టుకోవడం అవివేకం
ఉమ్మడి ప్రాజెక్టుల్లో నీటి వినియోగానికి ఆపరేషన్ రూల్స్ రూపొందించాలి
బజాజ్ కమిటీకి ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టీకరణ
హైదరాబాద్, ఫిబ్రవరి 15 (ఆంధ్రజ్యోతి): ‘‘తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాల మధ్య జల వివాదాలు వాంఛనీయం కాదు. రైతులెవరైనా రైతులే. ఏ రాష్ట్రం వారైనా రైతు ప్రయోజనాలే ముఖ్యం. మనక్కావాల్సింది నీరు కానీ.. వివాదాలు కాదు. నీటి కోసం
కోర్టుల చుట్టూ తిరగడం కన్నా, కలిసి కూర్చుని మాట్లాడుకోవడానికే నేను ప్రాధాన్యం ఇస్తాను’’ అని సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించారు. రెండు రాష్ర్టాల మధ్య ఉమ్మడి ప్రాజెక్టుల్లో నీటి వినియోగంపై కేంద్రం వేసిన ఏకే బజాజ్ నాయకత్వంలోని ఐదుగురు సభ్యుల కమిటీ బుధవారం ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్‌ను కలుసుకుంది. ఈ సందర్భంగా, ‘‘నీటి విషయంలో వివక్ష కారణంగానే తెలంగాణ ఉద్యమం వచ్చింది. నీళ్ల కోసం 60 ఏళ్లు గోసపడ్డాం. ఆ గోస తీర్చేందుకు ప్రయత్నిస్తున్నాం. మాకున్న వాటా ప్రకారమే నీటిని వాడుకుంటాం’’ కేసీఆర్ తెలిపారు.
సమైక్య రాష్ట్రంలో అన్యాయం
‘‘సమైక్య ఆంధ్రప్రదేశ్ లో అనుసరించిన వివక్షాపూరిత విధానాల వల్ల తెలంగాణ ప్రాంతం ఎంతో నష్టపోయింది. కేఎల్ రావు అనే ఇంజనీరు తెలంగాణకు అన్యాయం చేశారు. సాగర్ కుడి కాల్వకు ఎక్కువ, ఎడమ కాల్వకు తక్కువ నీరు అందేలా డిజైన్ చేశారు. తెలంగాణకు అన్యాయం చేసి ఆంధ్రకు నీరు మళ్లించినందుకు కృతజ్ఞతగా కేఎల్ రావును అక్కడ ఎంపీగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సమైక్య రాష్ట్రంలో ఇలాంటి అన్యాయాలు ఎన్నో జరిగాయి’’ అని కేసీఆర్ వివరించారు. తెలంగాణ ప్రాజెక్టులు ముందుకు పడకుండా వివాదాల్లో పడేశారని, భీమా వంటి ప్రాజెక్టులకు నికర జలాల కేటాయింపులున్నా పూర్తి చేయలేదని, ఏ ప్రాజెక్టునైనా సరే ఏదో ఒక సాకు పెట్టి ఆపేశారని ఆరోపించారు. పాలమూరు ప్రాజెక్టుపై మోదీ ఎన్నికల సమయంలోనే హామీ ఇచ్చారని, కిరణ్ కుమార్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడే జీవో జారీ చేశారని, దానిని తెలంగాణ వచ్చిన తర్వాత తాము కడతామంటే అడ్డుకుంటున్నారని తప్పుబట్టారు. ‘‘అదే ఆంధ్రవారు అక్రమంగా పులిచింతల కట్టారు. పోతిరెడ్డిపాడు కట్టారు. ఇప్పుడు ముచ్చుమర్రి కడుతున్నారు. కానీ, తెలంగాణ ప్రాజెక్టులకు అడ్డుపడుతున్నారు’’ అని వివరించారు.
గోదావరి నీటిని ఉపయోగించుకోవాలి
‘‘గోదావరిలోనే 3000 టీఎంసీలు ఉంది. కృష్ణాలో 1200 టీఎంసీల నీరుంది. తెలంగాణ సాగునీటి అవసరాలు తీరడానికి వెయ్యి టీఎంసీలు చాలు. అందుకే మేం ప్రాజెక్టులను నిర్మి స్తున్నాం. గోదావరిలో మాకు 954 టీఎంసీల నీటి హక్కు ఉంది. దాని ప్రకారమే ప్రాజెక్టులు డిజైన్ చేస్తున్నాం. మా వాటా ప్రకారమే నీటిని వాడుకుంటున్నాం. తక్కువ నీటి లభ్యత ఉన్న కృష్ణా నీటి విషయంలో జగడాలు పెట్టే బదులు గోదావరి నీటిని సమర్థంగా వినియోగించుకోవాలి. పోలవరం ప్రాజెక్టు ప్రతిపాదిత స్థలం నుంచి ప్రకాశం బ్యారేజీ, సోమశిల ప్రాజెక్టు ద్వారా గోదావరి నీటిని కోస్తా, రాయలసీమలకు తరలించడం చాలా సులభం. ఇలా చేస్తే ఏపీ అంతా సుభిక్షమవుతుంది. ఇదే విషయం చంద్రబాబుకు కూడా చెప్పాను. ఏటా వేల టీఎంసీలు సముద్రంలో కలుస్తుంటే, కేవలం 25-50 టీఎంసీల కోసం గొడవలు పెట్టుకోవడం అవివేకం’’ అని కేసీఆర్ చెప్పారు. తెలంగాణ రైతులకు న్యాయం చేయాలనేదే తమ లక్ష్యమని, అలాగని పొరుగు రాష్ట్రం నష్టపోవాలన్నది తమ అభిమతం కాదని చెప్పారు.
‘జీవించు, జీవించనివ్వు’ అన్నది తమ విధానమన్నారు. కాగా నదీ జలాల వినియోగానికి సంబంధించి రెండు వేర్వేరు స్కీములను అమలు చేయాలని సీఎం కేసీఆర్ సూచించారు. ‘‘గోదావరి, కృష్ణా జలాలను నాలుగు రాష్ర్టాలు వాడుకుంటున్నాయి. ఈ రెండు నదులపై మహారాష్ట్ర, కర్ణాటక అనేక ప్రాజెక్టులు కట్టాయి. దాంతో దిగువకు నీరు రావడం లేదు. సరైన వర్షాలు లేక నదుల్లో నీటి లభ్యత తక్కువ ఉన్న సమయంలో రాష్ర్టాల మధ్య నీటి పంపకం ఎలా జరగాలి? నీటి లభ్యత ఎక్కువై మిగు లు జలాలు ఉంటే నీటి పంపిణీ ఎలా ఉండాలనే విషయంపై రెండు వేర్వేరు ప్రతిపాదనలు రూపొందించాలి’’ అని చెప్పారు. కర్ణాటక, మహారాష్ట్ర నదులపై పెద్ద సంఖ్యలో డ్యాంలు కట్టాయని, దాంతో, నీటి ప్రవాహం తక్కువ ఉన్నప్పుడు కింది రాష్ర్టాలకు అన్యాయం జరుగుతోందని చెప్పారు. అందుకే, నాలుగు రాష్ర్టాలు ఏ సమయంలో ఎవరు ఎంత నీరు వాడుకోవాలనే విషయంలో స్పష్టత ఇవ్వాలని, ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని సీఎం కోరారు.
కాగా తెలంగాణ, ఏపీ మధ్య ఉన్న ఉమ్మడి ప్రాజెక్టుల్లో నీటి వినియోగానికి సంబంధించి విధానం రూపొందించాలని బజాజ్ కమిటీని సీఎం కేసీఆర్ కోరారు. ‘‘గతంలో నాగార్జున సాగర్, శ్రీశైలం ప్రాజెక్టుల నీటి వినియోగానికి సంబంధించి ఆపరేషన రూల్స్ లేవు. అందుకే మాకు అన్యాయం జరిగింది. ఇప్పటికైనా న్యాయం చేయండి. పట్టిసీమ ద్వారా గోదావరి జలాలను కృష్ణా బేసినకు తరలిస్తున్నందున, తెలంగాణ రాష్ర్టానికి అందుకు తగ్గ రీతిలో కృష్ణా జలాల్లో వాటా పెంచాలి’’ అని డిమాండ్ చేశారు.
మేమేం చేయలేం!.. చేతులెత్తేసిన బజాజ్ కమిటీ
16-02-2017 01:18:46
నీటి పంపిణీ మా చేతుల్లో లేదు
పోలవరం, పట్టిసీమలో వాటాను తేల్చలేం: బజాజ్ కమిటీ
హైదరాబాద్, ఫిబ్రవరి 15 (ఆంధ్రజ్యోతి): తెలుగు రాష్ర్టాల మధ్య నెలకొన్న నీటి పంపిణీ వివాదం మళ్లీ మొదటికొచ్చింది. దీనిపై పరిష్కారం కనుగొనడానికి కేంద్రం నియమించిన నిపుణుల కమిటీ చేతులు ఎత్తేసింది. నీటి పంపిణీ అంశం తమ చేతుల్లో లేదని స్పష్టం చేసింది. పోలవరం, పట్టిసీమ నీటి విషయంలోనూ తాము చేసేదేమీ లేదని ప్రకటించింది. దాంతో కమిటీ వైఖరిపై రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసి ంది. కమిటీ తీరుపై కేంద్రానికి ఫిర్యాదు చేస్తామని పేర్కొంది. తెలంగాణ, ఏపీ మధ్య జల వివాదాలను పరిష్కరించేందుకు కేంద్రం ఎ.కె. బజాజ్ కమిటీ నేతృత్వంలో ఐదుగురు సభ్యులతో కూడిన నిపుణుల కమిటీని నియమించిన విష యం తెలిసిందే. రెండ్రోజులుగా ఈ కమి టీ తెలంగాణ, ఏపీలో పర్యటించింది. చివరి రోజు బుధవారం జలసౌధలో ఉభయ రాష్ర్టాల అధికారులతో సమావేశమైంది. కమిటీ చైర్మన ఎ.కె.బజాజ్ నేతృత్వంలోని జరిగిన ఈ భేటీలో సభ్యులు శుక్లా, పాండే, రాయ్, మాథుర్, కృష్ణా బోర్డు చైర్మన్ ఎస్.కె.హల్దార్, కార్యదర్శి సమీర్ ఛటర్జీ, తెలంగాణ ప్రభుత్వ సలహాదారు విద్యాసాగర్‌రావు, ప్రత్యేక ప్రధా న కార్యదర్శి ఎస్.కె.జోషి, నీటిపారుదల శాఖ అధికారులు, ఏపీ ఇరిగేషన్ కార్యదర్శి, తదితరులు పాల్గొన్నారు.
నీటి కేటాయింపులపై రాష్ట్ర ప్రభుత్వం తరఫున స్పెషల్ సీఎస్ ఎస్.కె.జోషి ప్రస్తావిస్తూ.. పోలవరం నుంచి ఉమ్మడి ఏపీకి వచ్చే 45 టీఎంసీల నీటిలో 96 శాతం అంటే సుమారు 43 టీఎంసీల నీరు, అలాగే పట్టిసీమ నుంచి 65 శాతం అంటే 35 టీఎంసీల నీరు తెలంగాణకు వాటాగా రావాలని పేర్కొన్నారు. దీనిపై నిపుణుల కమిటీ స్పందిస్తూ ఈ విషయంలో తమకు ఎలాంటి అధికారం లేదని స్పష్టం చేసింది. పోలవరం, పట్టిసీమ నీరే కాకుండా కృష్ణాలోని నీటి కేటాయింపులపైనా తాము ఎలాంటి కొత్త నిర్ణయాన్ని తీసుకోలేమని పేర్కొంది.
నీటి కేటాయింపులపై ట్రైబ్యునల్‌లోనే తేల్చుకోవాలని సూచించింది. తెలంగాణ ప్రస్తావించిన అంశాలను కేంద్రం దృష్టికి తీసుకెళతామని, వారి సూచనల మేరకు నడుచుకుంటామని కమిటి సభ్యులు పేర్కొన్నారు. అయితే, కమిటీ వైఖరిపై విద్యాసాగర్‌రావు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. నీటి కేటాయింపుల అంశాన్నీ పరిశీలించాలని కేంద్రం సూచించినా అలా చేయడంలేదని అన్నారు. కమిటీ ఛైర్మన ఎ.కె. బజాజ్ మాట్లాడుతూ నీటి కేటాయింపులను ట్రైబ్యునల్ చేస్తుందని, తాము సలహాలను మాత్రమే ఇవ్వగలుగుతామని చెప్పారు.
మేమేం చేయలేం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Tuesday, 3 January 2017
న్యూఢిల్లీ, జనవరి 2: పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు పెండింగ్‌లో ఉన్నందున తాము విచారణ జరపలేమని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ స్పష్టం చేసింది. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన పిటిషన్ విచారణకు సుప్రీకోర్టు అనుమతి తీసుకురావాలని ట్రిబ్యునల్ సూచించింది. సోమవారంనాడు పోలవరం ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులను సవాల్ చేస్తూ రేలా అనే స్వచ్చంద సంస్థ దాఖలు చేసిన పిటిషన్ ట్రిబ్యునల్ చైర్మన్ జస్టిస్ స్వతంత్ర కుమార్‌తో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. ఎన్జీటి గతంలో కోరిన విధంగా సుప్రీంకోర్టులో పోలవరంపై దాఖలైన పిటిషన్ల వివరాలను పిటిషనర్ తరపు న్యాయవాదులు అనుప్ బోంబాని, శ్రవణ్‌కుమార్ ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. ఒడిశా, చత్తీస్‌గఢ్, తెలంగాణ జాగృతి సంస్థలతోపాటు కోదండరాం తదితరులు దాఖలు చేసిన పిటిషన్ల వివరాలను తెలిపారు. ఈ పిటిషన్లన్నీ దాదాపు పనె్నండేళ్లుగా సుప్రీం కోర్టులో పెడింగ్‌లో ఉన్నాయని ట్రిబ్యునల్ దృష్టికి తీసుకొచ్చారు. పోలవరం ప్రాజెక్టుపై గ్రీన్ ట్రిబ్యునల్‌లో విచారణ జరపడానికి సుప్రీం కోర్డు అనుమతి తీసుకురావాలని ఎన్జీటి సూచించింది లేదా పోలవరం నిర్మాణంలో జరుగుతున్న పర్యావరణ ఉల్లంఘనలపై తాజాగా పిటిషన్ దాఖలు చేయాలని గ్రీన్ ట్రిబ్యునల్ సూచించింది. ఈ మేరకు నెల రోజుల గడువు మంజూరు చేస్తూ కేసు తదుపరి విచారణను ఫిబ్రవరి 8కి వాయిదా వేసింది.

No comments:
Post a Comment