పోలవరం మాకు శాపం..
07-02-2017 03:13:58
దాని వల్లే కృష్ణాపై ఎగువ రాష్ట్రాల్లో కొత్త ప్రాజెక్టులు
కర్ణాటకలో 4 ఎత్తిపోతలకు అదే ఆధారం
మహారాష్ట్రలోనూ 14 టీఎంసీల ఎత్తిపోత
ట్రైబ్యునల్ తీర్పులోని క్లాజ్‌తో కేంద్రం ఓకే
దిగువకు నిలిచిపోనున్న 35 టీఎంసీలు
కేంద్రానికి ఫిర్యాదు చేయనున్న తెలంగాణ
హైదరాబాద్, ఫిబ్రవరి 6 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌లో నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టు తెలంగాణకు శాపంగా మారుతోందని రాష్ట్ర జల వనరుల అధికారులు భావిస్తున్నారు. ఆ ప్రాజెక్టులో భాగంగా చేసుకున్న ఒప్పందాల కారణంగానే ఎగువన ఉన్న కర్ణాటక, మహారాష్ట్ర కొత్త ప్రాజెక్టులను నిర్మిస్తున్నాయని గుర్తించారు. కృష్ణా నదిలో 35 టీఎంసీలను ఉపయోగించుకోవడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాయని అంచనాకు వచ్చారు. కర్ణాటక ప్రభుత్వం కృష్ణా నదిపై కొత్తగా నాలుగు ఎత్తిపోతల ప్రాజెక్టులను చేపడుతున్న విషయంపై సోమవారం ‘ఆంధ్రజ్యోతి’ ప్రత్యేక కథనాన్ని ప్రచురించిన విషయం తెలిసిందే. ఈ ఎత్తిపోతల పథకాలు పూర్తయితే, తెలంగాణ రాష్ర్టానికి తీరని అన్యాయం జరగనుంది. ఈ కథనంపై స్పందించిన మంత్రి హరీశ్ రావు.. కర్ణాటక చేపడుతున్న ప్రాజెక్టులపై అధ్యయనం చేయాల్సిందిగా రాష్ట్ర జల వనరుల అధికారులను ఆదేశించినట్టు సమాచారం. దాంతో వారు ఎగువ రాష్ర్టాలు కొత్తగా చేపడుతున్న ప్రాజెక్టులపై ఆరా తీసినట్టు సమాచారం. ఈ సందర్భంగా, ఏపీలో పోలవరం ప్రాజెక్టు నుంచి కృష్ణా ఆయకట్టుకు తరలించే నీటిని ఆధారంగా చేసుకుని ఎగువ రాష్ర్టాలు కొత్త ప్రాజెక్టుల నిర్మాణాలకు పూనుకుంటున్నట్టు వారి దృష్టికి వచ్చింది. గోదావరి ట్రైబ్యునల్ తీర్పులో పేర్కొన్న ఒక క్లాజ్ ఇందుకు కారణమని నిర్ధారణకు వచ్చా రు. ఎత్తిపోతల నిర్మాణాలకు కేంద్రం గ్రీన సిగ్నల్ ఇవ్వడంతో కృష్ణా నదిలో దిగువ కు వచ్చే నీటి ప్ర వాహం గణనీయం గా తగ్గిపోనుంది. ఈ అంశంపై కేంద్రానికి ఫిర్యాదు చేయాలని కూ డా ప్రభుత్వం నిర్ణయించినట్టు సమాచారం. అధికారుల నుంచి పూర్తి స్థాయి నివేదిక అందిన తర్వాత అధికారికంగా స్పందించాలని భావిస్తోంది. ఏపీలో గోదావరిపై పోలవరం ప్రాజెక్టును నిర్మిస్తుంటే, దానిని అడ్డం పెట్టుకుని కర్ణాటకలో కృష్ణా నదిపై ఎత్తిపోతలు నిర్మించడం ఏమిటనే సందేహం వస్తుంది. ఈమేరకు అధికారుల అధ్యయనంలో పలు అంశాలు వెలుగు చూశాయి.
ఆ 80 టీఎంసీల్లో మీకూ వాటా!
ఉభయ గోదావరి జిల్లాల్లో సాగునీరు, విశాఖకు తాగునీరు అందించేందుకు పోలవరం ప్రాజెక్టును నిర్మించాలని ఉమ్మడి ఏపీ నిర్ణయించింది. పారిశ్రామిక అవసరాలకు నీటిని అందించడంతోపాటు విద్యుదుత్పత్తి చేయాలని భావించింది. అలాగే, పోలవరం ప్రాజెక్టు నుంచి 80 టీఎంసీలను కృష్ణా డెల్టాకు మళ్లించి, అక్కడి సాగునీటి కొరత తీర్చాలని నిర్ణయించింది. ఈ 80 టీఎంసీలను పోలవరం కుడి గట్టు కాల్వ నుంచి సాగర్ దిగువకు మళ్లించాలని భావించింది. ఈ మేరకు 1978లో గోదావరి ట్రైబ్యునల్ ఎదుట ప్రతిపాదించింది. ఇందుకు కర్ణాటక, మహారాష్ట్ర అభ్యంతరం చెప్పాయి. గోదావరి నీటిని కృష్ణా నదికి మళ్లించడం ద్వారా కృష్ణా నదిలో ఎక్కువ నీటిని వాడుకోవడానికి ప్రయత్నిస్తోందంటూ గగ్గోలు పెట్టా యి. ఈ వివాదాన్ని పరిష్కరించుకోవడానికి కర్ణాటక, మహారాష్ట్ర ప్రభుత్వాలతో ఏపీ ప్రభుత్వం 1978 ఆగస్టు 4వ తేదీన ఒప్పందం కుదుర్చుకుంది. దాని ప్రకారం, కృష్ణా డెల్టాకు మళ్లించే 80 టీఎంసీల్లో ఉమ్మడి ఏపీ రాష్ట్రం 45 టీఎంసీలు, కర్ణాటక 21 టీఎంసీలు, మహారాష్ట్ర మిగిలిన 14 టీఎంసీలను పంచుకునేందుకు నిర్ణయించాయి. ఈ నీటిని నాగార్జున సాగర్ ఎగువన ఉపయోగించుకోవాల్సి ఉం టుంది. పోలవరం ప్రాజెక్టుకు కేంద్ర జల సంఘం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన మరుక్షణం నుంచే కృష్ణా నదిలో 35 టీఎంసీలను ఉపయోగించుకోవడానికి కర్ణాటక, మహారాష్ట్రలకు పూర్తి స్వేచ్ఛ ఉంటుందని అప్పటి ఒప్పందంలో పేర్కొన్నారు. తద్వారా, ఎగువ రాష్ర్టాలు కృష్ణా నీటిని ఈ కేటాయింపుల ప్రకారం పెంచుకోనున్నాయి. ఈ మేరకు 1980లో గోదావరి నది ట్రైబ్యునల్ తీర్పును వెలువరించింది. పోలవరం ప్రాజెక్టుకు సీడబ్ల్యూసీ అనుమతిని ఇచ్చిన మరుసటి రోజు నుంచే ఈ నీటిని ఉపయోగించుకోవడానికి వె సులుబాటును ఇస్తూ, తీర్పుల్లో (3వ పేజీ) క్లాజ్-7 పేరా ‘బి’లో ట్రైబ్యునల్ స్పష్టంగా పేర్కొంది. ఈ తీర్పును కర్ణాటక, మహారాష్ట్ర తమకు అనుకూలంగా మలచుకుని ఎత్తిపోతల పథకాలు నిర్మించుకుంటున్నాయి. కాగా పోలవరం నీటి పేరిట ఎగువ రాష్ర్టాలు కొత్త ప్రాజెక్టుల నిర్మాణానికి సిద్ధపడుతుండడంతో ఈ అంశంపై ఎవరికి ఫిర్యాదు చేయాలనే దానిపై తెలంగాణ ప్రభుత్వం తేల్చుకోలేకపోతోంది. ప్రస్తు తం ఏర్పడిన కృష్ణా బోర్డు రెండు రాష్ర్టాలకే చెందడంతో దానికి ఫిర్యాదు చేసే అవకాశఽం లేదు. అలాగే, కృష్ణా ట్రైబ్యునల్‌కు ఫిర్యాదు చేయడానికీఅవకాశం లేదు. దాంతో నేరుగా కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేయాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టు సమాచారం.
తేలని పోలవరం నీటి కోటా
పోలవరం ప్రాజెక్టు ద్వారా ఉమ్మడి ఆంధ్రప్రదేశ రాష్ర్టానికి లభించే 45 టీఎంసీల్లో తెలంగాణకు, ఆంధ్రప్రదేశ రాష్ర్టాలకు ఎంతెంత వాటా అనే విషయంపై ఇప్పటికీ స్పష్టత రాలేదు. దీనిపై ఇప్పటికే ఇటు బోర్డును, అటు కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వం పలు సార్లు కోరింది. అయినా 45 టీఎంసీల పునః పంపిణీ జరగలేదు. ఒకవైపు పోలవరం పూర్తి కాకుండానే,ఎగువ రాష్ర్టాలు పోలవరం కోటా ప్రకారం నీటి వినియోగానికి సిద్ధమతుండడం గమనార్హం.
తెలంగాణకే నష్టం ఎక్కువ!
పోలవరం పూర్తి కాకపోయినా, ఆ ప్రాజెక్టు కారణంగా గతంలో చేసుకున్న ఒప్పందాల ప్రకారం కృష్టా నీటిని అదనంగా ఉపయోగించుకోవడానికి ఎగువ రాష్ర్టాలకు అవకాశం ఉండడంతో కొత్త ప్రాజెక్టులను చేపట్టాలని నిర్ణయించాయి. అందులో భాగంగానే కర్ణాటక ప్రభుత్వం 21 టీఎంసీల సామర్థ్యంతో నాలుగు ఎత్తిపోతల పథకాల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. ఇందుకు కేంద్రం కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అలాగే, మహారాష్ట్ర కూడా పోలవరం వల్ల తమకు కేటాయించిన 14 టీఎంసీలను ఉపయోగించుకోవడానికి కొత్త ప్రాజెక్టులను ప్రతిపాదిస్తున్నట్టు తెలంగాణ జలవనరుల విభాగం అధికారులు గుర్తించారు. ఈ రాష్ర్టాలు కొత్త ప్రాజెక్టులను పూర్తి చేస్తే.. దిగువకు వచ్చే కృష్ణా నీటిలో 35 టీఎంసీలు తగ్గిపోనున్నాయి. దీని ప్రభావం తెలంగాణపై గణనీయంగా పడనుంది. ఏపీ ప్రభుత్వం ఇప్పటికే పట్టిసీమ పేరిట గోదావరి నది నీటిని కృష్ణా డెల్టాకు మళ్లిస్తోంది. దాంతో కృష్ణా నదిలో నీటి ప్రవాహం సరిగ్గా లేకపోయినా.. కృష్ణా ఆయకట్టు అవసరాలు తీర్చుకోవడానికి అవకాశం ఏర్పడింది.

No comments:
Post a Comment