Friday, 27 January 2017

సబ్సిడీపై 15 వేల ట్రాక్టర్లు!

సబ్సిడీపై 15 వేల ట్రాక్టర్లు!
28-01-2017 01:39:35

వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఇచ్చే యోచన: పోచారం

హైదరాబాద్‌, జనవరి 27 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో వచ్చే ఆర్థిక సంవత్సరంలో రైతులకు 10 నుంచి 15 వే ల సబ్సిడీ ట్రాక్టర్లను ఇవ్వాలనే యోచనలో ప్రభుత్వం ఉందని మంత్రి పోచారం శ్రీనివా్‌సరెడ్డి తెలిపారు. ఈ ట్రాక్టర్లకు సబ్సిడీ పోను.. మిగిలిన మొత్తాన్ని లబ్ధిదారుకు రుణంగా సహకార బ్యాంకులే సమకూర్చాలన్నారు. శుక్రవారం టెస్కాబ్‌ ప్రధాన కార్యాలయంలో డీసీసీబీ చైర్మన్లు, జిల్లా సహకారశాఖ అధికారుల (డీసీవోల)తో మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వ్యవసాయ, సహకార శాఖలు ఒకే గొడుగుకింద పనిచేయా ల్సి ఉందన్నారు. రాష్ట్రంలోని అనేక సొసైటీల ద్వారా రైతులకు సేవలు పొందే భాగ్యం లభించడంలేదని, అధ్యక్షులు, సీఈవోలూ లేకుండా తాళాలు వేసుంటున్నాయన్నారు. వ్యవసాయ యాంత్రీకరణలో బయటి దేశాలకు బదులుగా.. రాష్ట్రంలో యూనిట్లను ఏర్పాటు చేస్తున్న మహీంద్రా వంటి సంస్థలకు ప్రాధాన్యం ఇవ్వాల్సిందిగా సీఎం సూచించారన్నారు. కాగా, రైతులు సేంద్రియ వ్యవసాయంవైపు మళ్లాల్సిన అవసరం ఉందని మంత్రి అన్నారు. హాకా భవనలో రాష్ట్ర సేంద్రియ ధ్రువీకరణ అథారిటీని ప్రారంభించిన ఆయన ఉత్పత్తులపై అవగాహనకు సంబంధించిన పోస్టర్‌, కరపత్రాలు, సీడీలను ఆవిష్కరించారు.

No comments:

Post a Comment