గురివిందలు సిగ్గుపడుతున్నాయి!
10-01-2017 01:44:53
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పోలవరం నిర్మాణం చేపట్టి వేగంగా పూర్తిచేయడానికి తీవ్ర కృషి చేస్తుండటంతో ఈ ప్రాజెక్టు పూర్తయితే తమకు పుట్టగతులు వుండవన్న దురుద్దేశంతో పెద్ద కాంగ్రెసు, చిన్న కాంగ్రెస్ వారు ఆక్రోశం, ఆవేదన, అసహనంతో బాధపడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వంపై నిందలు వేస్తున్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే వారు స్వార్థ వ్యాధితో బాధపడుతున్నట్లు అర్థమవుతుంది. పోలవరం పూర్తవుతుందేమోనని నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు వారు. కమీషన్ల కోసం లాలూచి పడి పోలవరం ప్రాజెక్టు రాష్ట్ర ప్రభుత్వం నిర్మించేలా కేంద్రంపై చంద్రబాబు ఒత్తిడి తెచ్చారు అంటూ కేవీపీ రామచంద్రరావు విమర్శించడం సిగ్గుచేటు.
ఆనాటి జలయజ్ఞం దోపిడీలో అప్పటి ప్రభుత్వ సలహాదారు కేవీపీ రామచంద్రరావుదే ప్రధాన పాత్ర. అసలు కమీషన్ల కోసమే జలయజ్ఞం చేపట్టి అవినీతి యజ్ఞం చేసి రాష్ట్రం పుట్టి ముంచిందే కేవీపీ రామచంద్రరావు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి, కేవీపీ రామచంద్రరావు మధ్య సంబంధాలు ప్రపంచమంతటికీ తెలుసు. అట్లాగే ప్రాజెక్టుల పేరుతో వేలకోట్లు దోచుకున్న దొంగలంతా అవినీతిపై ప్రాజెక్టుల వద్ద బహిరంగ చర్చలు జరపాలంటూ లేఖలు రాయటం సిగ్గుచేటు. మేఘమథనం పేరుతో రూ.128కోట్ల ధనమథనం చేసిన పెద్దమనిషి రఘువీరారెడ్డి కూడా అవినీతిపై మాట్లాడటం విడ్డూరం. వీరి లేఖలతో వారు చేసిన పాపాలన్నీ ప్రక్షాళనై జనం పక్షపాతిగా మారారని జనం నమ్ముతారనే భ్రమల్లో వున్నారు వీరు. చందాలు, వసూళ్లు, కాంట్రాక్టులు, బదిలీలు, నియామకాలు, భూకేటాయింపులు ఇలా ఒకటేంటి అన్నిటిలో వైఎస్‌కి, కేవీపీ రామచంద్రరావు బినామీ అని ప్రపంచానికి తెలుసు. జలయజ్ఞం దారి తప్పటానికి కేవీపీ రామచంద్రరావు, జగన్‌లే సూత్రధారులు, పాత్రధారులు. వీరిద్దరి అత్యాశ వల్లనే వేలకోట్ల ప్రజాధనం దోపిడీ అయి ప్రాజెక్టులు రెండు తెలుగు రాష్ట్రాలకు గుదిబండలుగా మారాయి. జలయజ్ఞం చేపట్టి అదిగో హరితాంధ్రప్రదేశ్గా రాష్ట్రం కాబోతుంది అంటూ రైతుల్ని మభ్యపెట్టారు.
ప్రజల్ని పరిపాలించే వారికి ప్రజా దృక్పథం వుండాలి. అలా కాకుండా నిలువెల్లా స్వార్థంతో రూపకల్పన చేసిన జలయజ్ఞంలో జరిగిన దారుణాలు అన్నీ ఇన్ని కావు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి చేపట్టిన జలయజ్ఞం అవినీతి జలగలపాలిట పడి ఎలా భ్రష్టుపట్టిందో తెలుగు ప్రజలందరికీ తెలుసు. తడి గుడ్డతో రైతాంగం గొంతు కోసే దుస్తంత్రాన్ని ఆనాటి ముఖ్యమంత్రి నిష్టగా పట్టాలు ఎక్కించారు. కోటి ఎకరాల జలయజ్ఞం అంటూ ఆశపెట్టి ఆవిష్కరించిన సుందర స్వప్నం కేవలం కలగానే మిగిలిపోయింది. జలయజ్ఞంపై చెప్పిన గొప్పలన్నీ, ప్రకటనలన్నీ నీటి మూటలుగానే మిగిలాయి. నీరు దేవుడు ఎరుగు, నిజం ప్రాజెక్టులు ఎరుగు అన్న చందంగా మార్చారు. ప్రజాధనాన్ని యథేచ్ఛగా దోచుకోవడానికి అత్యంత అనువైన పథకంగా జలయజ్ఞాన్ని ఎంపిక చేసుకున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో వివిధ ప్రాజెక్టుల నిర్మాణం కోసం రైతుల నుంచి 7లక్షల ఎకరాలు సేకరించినా దాదాపు రూ.85వేల కోట్ల రూపాయలు ప్రజాధనం ధారపోసినా జలయజ్ఞం వల్ల ఒరిగిందేమిటి? లక్ష్యం ఎంత పవిత్రమైనది అయినా అమలు చేయటంలో స్వార్థం చోటుచేసుకుంటే అది నిరుపయోగమే. అప్పుడు అదే జరిగింది.
జలయజ్ఞంలో వైఎస్ తీసుకున్న విధాన నిర్ణయాలన్నీ కాంట్రాక్టర్ల ప్రయోజనమే పరమార్థంగా మార్చారు. ఎప్పటికప్పుడు వ్యయ అంచనాలు పెంచుకునేందుకు కల్పించిన వెసులుబాటు కాంట్రాక్టర్లకు కనక వర్షం కురిపించింది. రైతుల ప్రయోజనాల కన్నా గుత్తేదారులకు పనుల అప్పగింతే ముఖ్యం అన్నట్లు ప్రభుత్వం కథ నడిపించింది అని కాగ్ నివేదికలు తూర్పార పట్టాయి. ప్రాజెక్టులను సరైన ప్రణాళిక లేకుండానే చేపట్టారని కంప్ర్టోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ప్రాజెక్టుల పరిశీలనలో వెల్లడైంది. రాష్ట్ర ప్రభుత్వం జలయజ్ఞం పేరుతో చేసిన ఖర్చుకి, వచ్చిన ఫలితాలకు అసలు పొంతనే లేదని 2011 ఏప్రిల్ 19న ప్రణాళికా సంఘం అసంతృప్తి వ్యక్తంచేసింది.
కాంట్రాక్టులు కేటాయింపులో ప్రభుత్వ పనితీరు ఉగాండా నియంత ఇడీ అమీన్‌ను తలపిస్తుందని 2010 జూన్10న హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రజల డబ్బుతో చేపట్టే పనులను ఇష్టం వచ్చినట్లు నచ్చినవారికి కట్టబెట్టడం సరికాదని సుప్రీంకోర్టు, హైకోర్టు పలుమార్లు అక్షింతలు వేశాయి. నిర్మాణంలో గాడి తప్పిన వ్యయం, నిర్మాణంలో నత్త నడక, అవధులు లేని అవినీతి, నిర్మాణంలో కనపడని నాణ్యత ఇవన్నీ సాగునీటి ప్రాజెక్టుల మౌలిక లక్ష్యాన్నే దెబ్బతీస్తున్నాయి అని ప్రపంచ బ్యాంకు రహస్య నివేదిక ఆనాడే హెచ్చరించింది. ప్రాజెక్టుల విషయంలో పూర్తిస్థాయి సర్వే ఇన్వెస్టిగేషన్లను చేసి డిజైన్లను రూపొందించే బాధ్యతను కాంగ్రెస్ ప్రభుత్వం గుత్తేదారులకే అప్పగించడం అందర్నీ విస్మయానికి గురిచేసింది. డిజైన్ల ఆమోదంలో కాంట్రాక్టర్లకు పూర్తిగా వంత పాడింది ప్రభుత్వం. అడ్డుపడిన ఇంజినీర్లను అడ్డు తొలగించారు.
జలయజ్ఞం తలపెట్టిన నాడే ప్రాధాన్యతా క్రమంలో ప్రాజెక్టులు చేపట్టాలని, స్థాయికి తగినట్లు వనరులు అంచనా వేసి నిర్మాణం చేపట్టాలని, మేధావులు, నిపుణులు, ఇంజనీర్లు, ప్రతిపక్షాలు సలహాలిచ్చాయి. దాన్ని అధికారపార్టీ నాయకులకు, కాంట్రాక్టర్లకు ఆదాయ వనరుగా మార్చారు. పదేళ్ల పాటు ఖరీఫ్‌ల మీద ఖరీఫ్‌లు వచ్చి పోయాయి, వేలకోట్లు కరిగిపోయాయి తప్ప కాల్వల్లో నీరు పారలేదు, సాగునీటి కోసం ఎదురుచూసిన రైతుల కన్నీరు ఆరలేదు, చుక్క నీరు పొలాల్లోకి జారలేదు. పోలవరం ప్రాజెక్టులో అంచనాలు పెంచారని గగ్గోలు పెడుతున్నారు. కానీ నేడు ప్రాజెక్టు వ్యయం పెరగటానికి కారణం ఇప్పటి ధరలకు అనుగుణంగా అంచనా వేయటం వల్లనే. ఆనాడు సమగ్ర విధానాలు, పక్కా ప్రణాళికలు లేకుండా రాత్రికిరాత్రి అంచనాలు పెంచేసి రాజమార్గాన ప్రజాధనాన్ని దోచేశారు. నిధులు స్వాహా చేయాలన్న ఆరాటం తప్ప రాష్ట్ర ప్రయోజనాలు పట్టించుకోలేదు. రైతు ప్రయోజనాల పేరిట వైఎస్ ప్రభుత్వం నిర్ణయాల వెనుక జరిగిందంతా స్వార్థ ప్రయోజనమే.
విద్యుత్ వ్యవస్థ కుప్పకూలటం, రాష్ట్రం చీకటి కావటం, పారిశ్రామిక రంగం పతనం కావటం, నిరుద్యోగం పెరగటం, గ్రామీణ ప్రాంతాలు జీవం కోల్పోవటానికి పదేళ్ళ కాంగ్రెస్ పరిపాలన కాదా? వ్యవసాయ సంక్షోభం, రైతు ఆత్మహత్యలు పెరగటానికి, అంతులేని అవినీతితో రాష్ట్రం దోపిడి కావటానికి, ప్రజాస్వామ్య వ్యవస్థలు, రాజ్యాంగ వ్యవస్థలు ధ్వంసం కావటానికి కాంగ్రెస్ వారు కారణం కాదా? సమస్త సంపదను దోచేసి నేడు నిజాలకు తూట్లు పొడుస్తున్నారు.
అధికారం లేకపోతే ఆదర్శాలు గుప్పించడం, అధికారంలో వుంటే అవినీతి, అరాచకం, అవకాశవాదం కాంగ్రెస్ పార్టీ చరిత్ర. అందుకే ప్రాజెక్టుల పేరిట వారు ఎన్ని విన్యాసాలు చేసినా ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. పదేళ్ల కాంగ్రెస్ పాలకుల ప్రజా వ్యతిరేక విధానాలు రైతుల్ని క్రుంగదీశాయి. వారు ఎన్ని లేఖలు రాసినా వారిని దయామయులుగా జనం గుర్తించరు. పోలవరం నిర్మాణం వేగం అందుకోవడంతో అది 2018నాటికి పూర్తయితే తమ పుట్టి మునగటం ఖాయం అన్న భయంతో తల్లి కాంగ్రెస్ వారు, పిల్ల కాంగ్రెస్ ప్రభుత్వంపై అహేతుక విమర్శలకు తెగబడుతున్నారు. మీ కువిమర్శలు ఇప్పటికైనా మానండి, ప్రజాభ్యుదయం కోసం ప్రాజెక్టులకు అడ్డుపడకండి, ప్రభుత్వానికి సహకరించండి.
-దేవినేని ఉమా మహేశ్వరరావు
జలవనరుల శాఖామాత్యులు.

No comments:
Post a Comment