Monday, 9 January 2017

‘సాగుబడి’లో కెనడా విద్యార్థులు

‘సాగుబడి’లో కెనడా విద్యార్థులు
10-01-2017 11:45:07

గన్నారంలో ‘నవారా’ వరి సాగు పరిశీలన
సేంద్రియ సాగు పద్ధతులపై ప్రశంసలు
రాయపర్తి (వరంగల్‌రూరల్‌ జిల్లా)
మండలంలోని గన్నారం గ్రామంలో సేంద్రీయ పద్ధతిలో సాగు చేస్తున్న పంటలను కెనడా దేశానికి చెందిన విద్యార్థులు సోమవారం పరిశీలించారు. బాలవికాస స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో సేంద్రీయ పద్ధతిలో వ్యవసాయం చేస్తున్న తీరును తెలుసుకోవడానికి విదేశీయులు గ్రామానికి రావడంతో రైతులు ఎడ్లబండ్లలో ఎక్కించుకుని డప్పువాయిద్యాలతో ఆహ్వానించారు. అనంతరం రైతు విశ్వేశ్వర్‌రెడ్డి సాగు చేసిన వ్యవసాయ క్షేత్రాన్ని పరిశీలించారు. సేంద్రీయ ఎరువులతో వరి, పత్తి, మామిడి తోటలను ఎలా సాగు చేశారో తెలుసుకున్నారు. భూసారం పెంచేందుకు రసాయన రహిత ఎరువుల తయారీ విధానాన్ని రైతులు చూపించారు. సేంద్రీయ సాగుకు పేడ, ఆవు మూత్రం, వావిలాకు, పొగాకు, వేపకాయలు, పప్పులు, తౌడు, కారం, బెల్లం, మట్టి తదితర ద్రావణాలతో ఏ సాగుకు ఎంత మోతాదులో చేయాలో తెలుసుకుని వాటిని నోట్‌ చేసుకున్నారు. కెనడా విద్యార్థులు సైతం రైతులు తయారుచేసే సేంద్రీయ ఎరువును ఎంతో ఆసక్తిగా చూసి కెమెరాల్లో బంధించారు.

ఆర్థిక చేయూత అందిస్తాం: విదేశీ విద్యార్థులు
వ్యవసాయ క్షేత్రంలో జరిగిన సమావేశంలో కెనడా దేశస్థులు జనీతా, మార్టీనా, డానిష్‌ మా ట్లాడుతూ బాలవికాస సంస్థ అందిస్తున్న సూచనలు రైతులు నూటికి నూరుశాతం పాటించి సేం ద్రీయ ఆహార ఉత్పత్తులను పెంచడం అభినందనీయమన్నారు. సంపూర్ణ ఆరోగ్యం కోసం సేం ద్రీయ ఆహారం తీసుకోవాలనే లక్ష్యంతోనే తాము ఆర్థిక సహాయం అందిస్తున్నామని తెలిపారు. ప్రపంచ దేశాలు రసాయన ఎరువులను తగ్గించి సేంద్రీయ ఎరువులతో పండించిన ఆహారం తీసుకున్నప్పుడే ఆరోగ్యవంతమైన సమాజం ఏర్పడుతుందన్నారు. సేంద్రీయ సాగును ప్రతీ ఒక్కరు ప్రోత్సహించి పాటించాలని కోరారు.

సాగు భేషుగ్గా ఉంది
గ్రామంలో కెనడా విద్యార్థుల బృందం మాట్లాడుతూ విశ్వేశ్వర్‌రెడ్డి సాగు చేసిన నవారా వరి వంగడం సాగు సేంద్రీయ ఎరువులతో చేయడం చాలా బాగుందని కితాబిచ్చారు. నవారా సాగులో అధిక దిగుబడి రావడంతో రైతులకు ఎంతో మేలు జరుగుతుందని అన్నారు. ఈ విధానాన్ని తమ దేశంలో పాటించే విధంగా రైతులకు అవగాహన కల్పిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ బెల్లి యాదమ్మ, బాలవికాస ప్రోగ్రాం అధికారి తిరుపతి, కో ఆర్డినేటర్‌ లింగారావు, రాజ్‌కుమార్‌, మురళీ, కిరణ్‌, రాంబాబు, తిరుపతి, రైతులు తదితరులు పాల్గోన్నారు.

No comments:

Post a Comment