ప్రణాళిక లేకపోతే.. జల గండం
10-01-2017 06:52:20
ఆంధ్రజ్యోతి - విజయవాడ: నిర్ధిష్ట ప్రణాళిక ప్రకారం ప్రాజెక్టులను పూర్తి చేయ కపోతే రాష్ట్రానికి జలగండం పొంచి ఉందని రైతాంగ సమాఖ్య ఆధ్వర్యంలో విజయవాడ ఎగ్జిబిషన్ సొసైటీ హాలులో నిర్వహించిన చర్చావేదికలో పాల్గొన్న వక్తలు అభిప్రాయ పడ్డారు. రైతాంగ సమాఖ్య అధ్యక్షుడు ఎర్నేని నాగేంద్రనాథ్ మాట్లాడుతూ గోదావరి నది నీటి కేటాయింపులపై స్పష్టత, ఆ నదిపై కడుతున్న ప్రాజెక్టులు, ఏపీలో కడుతున్న ప్రాజెక్టులపై ప్రభుత్వాలు వివరణ ఇవ్వాల్సి ఉందన్నారు. కృష్ణానదిపై శ్రీశైల జలాశయం నుంచి తెలంగాణా ప్రభుత్వం 150 టీఎంసీల నీటిని ఎత్తిపోతల ద్వారా పాలమూరు- రంగారెడ్డి, దిండి ఎత్తిపోతల పథకాలు, గోదావరిపై గల ప్రాజెక్టులను రీ డిజైన్ చేసి 500 టీఎంసీల నీటిని దిగువ నుంచి ఎగువ కు పంప్ చేయడానికి కార్యాచరణ చేసింద న్నారు. బడ్జెట్‌లో రూ.15 వేల కోట్లు కేటా యించారని, దీంతో ఏపీలో ఇప్పటికే ఉన్న నీటి కొరత సమస్య ఇంకా జఠిలమవుతుంద ని తెలిపారు. ఎగువ రాష్ట్రాలైన మహారాష్ట్ర, కర్నాటకలకు బచావత కేటాయించిన 1320, బ్రిజేష్ కుమార్ కేటాయించిన 1573 టీఎంసీ లకు మించి అనుమతిలేని అక్రమ ప్రాజెక్టుల ను నిర్మించి 700 నుంచి 800 టీఎంసీ నీటి వినియోగానికి చర్యలు చేపట్టినట్లు తెలిపా రు. తుంగభద్ర ద్వారా రాయలసీమకు కేటాయించిన 94 టీఎంసీలకు 75 టీఎంసీలు వినియోగంలోకి వస్తున్న సమయంలో తుంగ భద్ర ప్రాజెక్టుపై 40 టీఎంసీల అదనపు కేటా యింపు వల్లనీటి కొరత పెరుగుతుందని చెప్పారు. కొయినా, అల్మట్టిలకు 185 టీఎంసీ లు అదనంగా కేటాయించడం వల్ల కృష్ఱానది కి నీటి చేరిక తగ్గి రెండు తెలుగు రాష్ట్రాలు నష్టపోయే అవకాశం ఉందని చెప్పారు. మిగులు జలాల ఆధారంగా తెలంగాణలో నిర్మాణంలో ఉన్న నెట్టెంపాడు, కోయిల్‌సాగర్, కల్వకుర్తి, శ్రీశైలం ఎడమగట్టు కాల్వ ఏఎంఆ ర్ ప్రాజెక్టులకు 105 నుంచి 110 టీఎంసీలు నీరు కావాల్సి ఉందన్నారు. 120 సంవత్సరా లుగా ఉన్న డెల్టా ఆయకట్టుకు 156 టీఎంసీ లు అవసరమని చెప్పారు. సాగర్ నుంచి దీని కోసం 76 టీఎంసీలు మాత్రమే వస్తున్న దని, మిగిలిన 80 టీఎంసీలు సాగర్‌కు దిగు వన ఉన్న వనరుల నుంచే నీరు వస్తుందని చెప్పారు. బచావత, బ్రిజేష్ ట్రిబ్యునళ్ళు కేటా యించిన నీటిలో ఏపీలో మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్టులకు 479 టీఎంసీలు, మైనర్ ఇరిగేష న్‌కు 42 టీఎంసీలు, తెలంగాణాలో మేజర్ ఇరిగేషన్‌కు 172, మీడియం, మైనర్ ఇరిగేష న్‌కు 122 టీఎంసీల కేటాయింపులు ఉన్న విషయాన్ని గమనించాలన్నారు. కేటాయింపు ల కన్నా అదనపునీటి వినియోగాన్ని వెంటనే నిలిపివేయాలన్నారు. పులిచింతల వద్ద రివ ర్స్‌బుల్ టర్బయిన్లను ఏర్పాటు చేయాలని చెప్పారు. ప్రకాశం బ్యారేజీ- పులిచింతల మధ్య 89 కిమీ దూరంలో రెండు బ్యారేజీలు నిర్మించి 57 అడుగుల జలాశయంలోకి ఎత్తిపోయాల్సి ఉంటుందన్నారు.
పోలవరంపై అసత్య ప్రచారాలు
పోలవరానికి కేంద్రం ఇచ్చిన చెక్కు యావత్తు జాతీయ ప్రాజెక్టులకు ఇచ్చిన దిగా ఉందని, పోలవరంపై అసత్య ప్రచారాలు సాగుతున్నాయని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణకుమార్ తెలిపారు. ప్రాజెక్టుల విష యంలో ఎవరు చెప్పినా ప్రభుత్వం వినడం లేదని చెప్పారు, ప్రాజెక్టుల విషయంలో కోర్టులకు వెళ్ళడం అనవసరమని, అవి ఎప్ప టికి తేలుతాయో తెలియదని, ప్రభుత్వానికి అనుకూలంగానే ఇప్పుడు కోర్టులు కూడా వ్యవహరిస్తున్నాయని చెప్పారు. కాంగ్రెస్ నాయకుడు తులసిరెడ్డి మాట్లాడుతూ ఆయా ప్రాజెక్టుల వద్ద ఉన్న ప్రస్తుత పరిస్థితులను గణాంకాలతో వివరించారు. బీజేపీ రైతు సంఘం నాయకుడు పూడి తిరుపతిరావు మాట్లాడుతూ, తాము ప్రభుత్వంలో ఉన్నట్లా, లేనట్లా అనేది తేల్చుకోలేక పోతున్నామని, ప్రభుత్వం అటు ప్రతిపక్షాల మాటగాని, ఇటు ప్రజా సంఘాల మాట గాని పరిగణనలోకి తీసుకోవడం లేదన్నారు. రాయలసీమకు చెందిన ఇరిగేషన్ మాజీ ఇంజనీర్ నాగిరెడ్డి మాట్లాడుతూ, సాగునీటి ప్రాజెక్టుల విషయంలో రాయలసీమకు తీవ్ర అన్యాయం జరుగుతుందని తెలిపారు. పోల వరం విశ్రాంత ఎస్‌ఈ హరనాథ్ మాట్లాడు తూ ప్రాజెక్ట్‌కు వేసిన అంచనాలకన్నా మించి అంచనాలు ఇప్పుడు ఉన్నాయని, దీనిపై అనేక సందేహాలు ఉన్నాయని చెప్పారు. ఈ సమావేశంలో రైతు సమాఖ్య నాయకుడు కుమారస్వామి, పలువురు రైతు నాయకులు, విశ్రాంత ఎస్‌ఈలు పాల్గొన్నారు.
తీర్మానాలు ఇవి..
సమావేశంలో పలు తీర్మానాలు చేశారు. పోలవ రం 2019లో పూర్తి చేస్తుండగా పురు షోత్తమ పట్నం ఎత్తిపోతల అవసరం లేదని, పట్టిసీమ ద్వారా ప్రకాశం బ్యారేజీకి 50 టీఎంసీల నీటిని పంపి, పులిచింతల నీటిని కూడా సద్వినియోగ పరచుకునేలా చర్యలు తీసుకోవాలని తీర్మానాలు చేశారు. పోలవరం నుంచి గ్రావిటీ ద్వారా నీరు ఇస్తామని, ప్రాజెక్టును పూర్తి చేస్తామని ప్రకటించి నందుకు హర్షం వ్యక్తం చేస్తూనే భూసేకరణ, ఉపాధి, పునరావాసం, హెడ్‌వర్క్స్‌లో ఐదుకోట్ల క్యూబిక్‌మీటర్ల నెట్‌వర్క్, 37 లక్షల క్యూబిక్‌మీటర్ల కాంక్రీట్ వర్క్, స్పిల్‌వే, 40 గేట్ల నిర్మాణం, రాక్‌ఫిల్‌డ్యామ్ నిర్మాణం, అలాగే రూ. 30 వేల కోట్ల నిధుల సమీకరణ వంటి విషయాలపై పలువురు అనుమానాలను వ్యక్తం చేశారు. సాగర్‌లో నీరు ఉన్నా కూడా ఇవ్వలేని పరిస్థితిపై సమావేశం ఆందోళన వ్యక్తం చేసింది.
No comments:
Post a Comment