Monday, 30 January 2017

పాలేకర్ వ్యవసాయం... ఎకరాకు లక్షల్లో ఆదాయం

పాలేకర్ వ్యవసాయం... ఎకరాకు లక్షల్లో ఆదాయం
20-02-2016 14:53:48
http://www.andhrajyothy.com/artical?SID=209046

దున్నువాడు దుశ్శాసనుడు. దున్నమనేవాడు ధుర్యోధనుడు. ఆపగలిగీ ఆపనివాడు దృతరాష్ట్రుడు. దున్నడం తప్పు అని తెలిసినా చోద్యం చూస్తూ కూర్చున్నవాడు భీష్మాచార్యుడు. వింటున్నది భారతమే కానీ కంటెంట్ ఏమిటి కొంచెం తేడాగా ఉంది? అనుకుంటున్నారా? ఈ కథనం చదివితే అదేంటో మీకే అర్థమవుతుంది.

కాపుగర్జన పుణ్యమా అని మరుగున పడిపోయింది కానీ... తునిలో రైలంటుకునే సమయానికి కాకినాడలో వారంపాటు సాగిన ఒక బృహత్తర కార్యం విజయవంతంగా ముగుస్తూ ఉంది. అదే పాలేకర్ ప్రకృతి వ్యవసాయ శిక్షణ శిబిరం. మొదట్లో అందరూ దీన్ని వ్యవసాయశాఖ డబ్బులు ఖర్చుచేయడం కోసం చేసే తూతూమంత్రపు వ్యవహారమే అనుకున్నారు. మొదటి రెండు రోజులు రాష్ట్రం నలుమూలల నుంచి వ్యవసాయ అధికారుల బలవంతంపై వచ్చిన కొందరు తిరుగుటపాలో వెల్లిపోయారు. కానీ ఉన్నవాళ్లకు మాత్రం మూడో రోజుకల్లా మేటర్ మెదళ్లలోకి చేరింది. పురుగు తొలచినట్టు తొలిచేసింది. 20 ఏళ్ల కుర్రరైతూ, 80 ఏళ్ల వృద్ధరైతూ పెన్నూ పుస్తకం పట్టి పాలేకర్ చెప్పే ప్రతి అక్షరం చెక్కేయడం మొదలెట్టారు. పట్టభద్రులు, వృత్తి నిపుణులూ ఇందుకు మినహాయింపు కాదు.

ఇక వ్యవసాయ అధికారులకైతే మొదటి రెండు రోజులు మొహాన రక్తంచుక్క ఉంటే ఒట్టు. డబ్బులిచ్చి దెబ్బలు తినడం అంటారే అలా అయిపోయింది వారి పని. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికారికంగా కోట్లు ఖర్చుచేసి కార్యక్రమం నిర్వహిస్తోంది. వ్యవసాయశాఖ మంత్రి, స్పెషల్ సీఎస్, డీన్‌లు, సైంటిస్ట్‌లు, జేడీలు, డీడీల దగ్గర నుంచి గ్రామాల్లో తిరిగే అగ్రికల్చర్ ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్ల వరకూ అక్కడే ఉన్నారు. పాలేకరేమో ప్రభుత్వాలను, వ్యవసాయ విశ్వవిద్యాలయాలను, అందులో విద్యనభ్యసించి రైతులను ఉద్దరిస్తున్న వ్యవసాయ అధికారులను తిట్టిపోస్తున్నారు. మహా పాపియోం... అంటూ మరాఠాలో శాపనార్థాలు పెడుతున్నారు. ఏం అర్థంకాలేదు చాలా మందికి. కానీ మూడో రోజుకల్లా పాలేకర్ బ్రెయిన్ వాష్‌తో వారిలోనూ ఏదో మార్పు. అవును మనం చేసేది తప్పే అన్న అపరాధ భావన వారి మొహంలో లీలగా కనిపించింది. దీనికి తోడు రైతుల చప్పట్లు, హర్షాతిరేకాలు, ప్రాశంగిక సాక్ష్యాలు, పాలేకర్ పద్ధతిలో ఇప్పటికే విజేతలుగా నిలిచిన వారి అనుభవాలు... అవి చెబుతున్నప్పుడు వారి మొహంలో కనిపిస్తున్న వెలుగులు... వీటిమధ్య అక్కడున్న ఎవ్వరికీ పాలేకర్ చెబుతున్నదాన్ని కాదనే ధైర్యం లేకుండాపోయింది. అంత పగడ్బందీగా ఉన్నాయి పాలేకర్ చెప్పే విషయము, విధానమూను..! కానీ ఎలా?... హౌ ఈజ్ ఇట్ పాజిబుల్? ఇదే ప్రశ్న చాలా మందిలో మొదట్లో ఏర్పడింది. అయితే అయిదురోజుల్లో అక్కడున్న వారిలో నూటికి 90 మందిని పాలేకర్ కన్విన్స్ చేయగలిగారు. చేస్తేగీస్తే ప్రకృతి వ్యవసాయమే చేస్తామని కొందరు... పాలేకర్‌కు వెంటనే ప్రభుత్వం రక్షణ కల్పించాలని కొందరు... ఆయన భారతీయ రైతులోకానికి ఒక వెలుగురేఖ అని మరికొందరు.. కాదు- కాదు అవతార పురుషుడు, దేవుడు అని ఇంకొందరు ప్రశంసల మీద ప్రశంసలు కురిపించారు. అయితే ఇవేమీ ముఖస్తుతి వ్యాఖ్యలు కాదు. గుండెలోతుల్లోంచి ఉప్పొంగిన మాటలు. ఇన్నాళ్లూ తాము వెతుకుతున్నదేదో దొరికిందన్న సంతృప్తి. ఇంతకీ ఆయన చెప్పింది ఏమిటి ? దేన్నీ ఒక పట్టాన అంగీకరించని రైతులను, వ్యవసాయ శాస్త్రవేత్తలను, వ్యవసాయ అధికారులను, ప్రభుత్వాన్ని ఒకే వేదిక నుంచి ఒకే రకమైన ప్రసంగంలో ఎలా ఆయన కన్విన్స్ చేయగలిగారు అన్నది ఆసక్తికర అంశమే!

పాలేకర్ చెప్పేది ప్రకృతి వ్యవసాయం. అంటే అంతా ప్రకృతికి వదిలేసి కూర్చోవడం కాదు. ప్రకృతికి ఎదురెళ్లకుండా ఉండడం. ప్రకృతితో కలిసి నడవడం. పాలేకర్ చెప్పేది ఆధ్యాత్మిక వ్యవసాయం. అంటే మంత్రాలతో చింతకాయలు రాలగొడతారని అనుకుంటే పొరపాటు. ఉదయంపూట భక్తితో పూజచేసి, ఆ తర్వాత రోజంతా పురుగుమందులు పొలంలో చల్లి లక్షలాది జీవరాసులను చంపి, రసాయన అవశేషాలతో కూడిన పంటను ప్రజలకు అందించి... వారికి అనేక కొత్తకొత్త రోగాలు రావడానికి కారణమయ్యి... రాత్రికి తిరిగొచ్చి మళ్లీ ఏ గుడిలోనో భజనచేస్తే పుణ్యం వస్తుందా? ఈ ప్రకృతిలో ఏ జీవీ అకారణంగా మరొక జీవిపై దాడిచేయదు. చంపదు. ఒక్క మనిషి తప్ప! కాదనగలరా?... ఇదీ పాలేకర్ ప్రశ్న. అదే నాస్తికులకైతే... మీరు సాటి మనిషినే అన్నింటికంటే బాగా ప్రేమిస్తారు కదా... మరి ఆ మనిషికి విషంతో కూడిన ఆహారాన్ని పండించి అందిస్తారా ?.. అని అడుగుతారు. పాలేకర్ చెప్పేది జీరో బడ్జెట్ వ్యవసాయం. అంటే పెట్టుబడి లేని వ్యవసాయం అని చాలామంది తప్పుగా అన్వయించుకుంటారు. కానే కాదు. ప్రధాన పంటలో వేసే అంతర పంటల వల్ల వచ్చే ఆదాయం మొత్తం పెట్టుబడికి సరిపోవడం. ప్రధాన పంట పూర్తి లాభంగా రైతుకు చేరడం. తక్కువ పెట్టుబడి కారణంగా ప్రకృతి ప్రకోపిస్తే.... నష్టంలేకుండా బైటపడడం. ఇదీ జీరో బడ్జెట్ అంటే!

పాలేకర్ విధానంలో కొన్నాళ్లకు పంట నీటిని అడగదు. ఎరువు అవసరం లేదు. పురుగుమందుతో పనే లేదు. అలాగని ఇది సేంద్రియ వ్యవసాయం అనుకునేరు. సేంద్రియం అన్న మాట వింటేనే పాలేకర్ మండిపడతారు. ట్రాక్టర్ల కొద్దీ పశువుల ఎరువు తోలాలంటే ఎక్కడనుంచి తెస్తావు. అసలు ఆ అవసరం ఏంటి? అంత ఖర్చెందుకు? అనేది పాలేకర్ ప్రశ్న. భూమి పోషకాల సముద్రమంటారాయన. ఆ పోషకాలను మొక్కకు అనువుగా మార్చి అందించే సూక్ష్మజీవులను మనం ఈ కెమికల్స్ వాడి చంపేస్తున్నామంటారాయన. మన నేలలో సహజసిద్ధంగా ఉండే వానపాములే అతి బలవంతులైన ట్రాక్టర్లు. నేలను దున్నడంతో పాటు అవి వర్షపునీటిని భూమి అడుగు పొరలకు చేర్చడం, వర్షం లేనప్పుడు తమ శరీర తేమద్వారా, కొన్ని రసాయనాల ఉత్పత్తి ద్వారా తేమా, పోషకాలు రెండూ అవి అందిస్తాయని సూత్రీకరిస్తారాయన. భూమి పైపొరల్లో ఉండే మేలైన సూక్ష్మజీవులను లోతు దుక్కి ద్వారా నేల అడుగు భాగానికి చేరి చనిపోతాయని, అందుకే భూమిని దున్నే రైతును తాను దుశ్శాసనుడిగా భావిస్తానంటారాయన. దున్నమని చెప్పే వ్యవసాయ విశ్వవిద్యాలయాలు, శాస్త్రవేత్తలను దుర్యోధనుడితోనూ... నిధులు సమకూరుస్తూ ఈ దుర్మార్గానికి మద్దతుగా నిలుస్తున్న ప్రభుత్వాలను దృతరాష్ట్రుడిగా అభివర్ణిస్తారు. ఇక జరుగుతున్న చెడు నంతటినీ చూస్తూ... ఏ ఒక్కరినీ వారించని మేధావివర్గాన్ని భీష్మాచార్యులతో పోలుస్తారాయన. నేలను దున్నడాన్ని భూమాతను వివస్త్రను చేయడంగానూ... భూదేవిని చెత్త, కలుపు మొక్కలతో ఆచ్ఛాదన చేసేవాడిని ద్రౌపతికి చీరలు అందించిన శ్రీకృష్ణుడిగానూ చెబుతారాయన. (ఈ వర్ణన బోర్డ్‌పై గీసి మరీ ఉంటుంది. వీడియోలో గమనించొచ్చు) మంచునీ, వర్షాన్నీ, ఎండనీ, తేమనీ, గాలినీ ఎలా ఉపయోగించుకోవాలో పాలేకర్ చెబుతుంటే అద్భుతమనిపిస్తుంది.

వ్యవసాయ శాస్త్రవేత్తలు మొక్కలకు అవసరమైన మూడు ప్రధాన పోషకాలైన నత్రజని, భాస్వరం, పొటాషియంలను ఎన్‌ : పీ : కే గా చెబుతుంటారు. ఈ మూడు అందించే సూక్ష్మజీవులు, వానపాములు మన భూమిలోనే ఉన్నాయనీ వాటిని ఈ కృత్రిమ ఎన్ పి కేలతో చంపేయవద్దని అంటారాయన. ఈ సూక్ష్మజీవులన్నింటినీ ఉత్పత్తి చేసే ఒకేఒక ఫ్యాక్టరీ దేశీయ ఆవు జీర్ణాశయమే అనీ... దానిని నేను శాస్త్రీయంగా నిరూపిస్తాననీ సవాల్ చేస్తారాయన. ఒక్క దేశీయ ఆవు పేడ, మూత్రం కలిపిన కల్చర్‌తో ముఫ్పై ఎకరాల సేద్యం చేయవచ్చునన్నది పాలేకర్ సిద్దాంతం. ప్రస్తుతం ఉన్న జెర్సీ, హెచ్ ఎఫ్ ఆవులను ఆయన ఆవులుగా అంగీకరించరు. అవి వేరే జాతికి చెందిన భయంకర జంతువులని సశాస్త్రీయంగా వివరించడం పాలేకర్ ప్రత్యేకత. పాలేకర్ నోటివెంట వస్తున్న సాంకేతిక బాష, దేశ- విదేశీ శాస్త్రవేత్తల పేర్లు, వారు చేసిన మంచిచెడ్డలు చెప్పడం చూసి ప్రతి వ్యవసాయ శాస్త్రవేత్తా నోరెళ్లబెట్టడం తప్ప మరేం చేయలేకపోయారక్కడ. నెహ్రూ ప్రవేశపెట్టిన హరిత విప్లవాన్ని ‘ఆనాటి అవసరం- నేటి ప్రమాదం’గా అభివర్ణిస్తారాయన. అదంతా విదేశీకుట్ర అని బల్లగుద్ది మరీ చెబుతారు. ఇది వింటున్న మీకు నిజమా అనిపిస్తుంది కానీ... పాలేకర్ శిక్షణా శిబిరంలో వారంపాటు కూర్చుంటే మాత్రం మీరే ఈ వాదనకు దిగుతారు. కొన్ని సంవత్సరాల క్రితం పాలేకర్ విధానానికి, ఇప్పటి విధానానికి పెద్దగా మార్పులు లేకున్నా... ఆయన వాదనలో హేతుబద్దత, సాంకేతికత, ఉదాహరణ సహిత వివరణ ఇప్పుడు మరింత పెరిగిందని చెప్పాలి. దీనికి తోడు ఆయన ఫాలోవర్స్ వేలమంది మేము... మేము అంటూ స్టేజ్ ఎక్కి... తమ విజయాలు, అనుభవాలు చెబతుంటే... సభికుల నుంచి చప్పట్ల మోత ఆగడంలేదు. ఒకప్పుడు ఎవరో పిచ్చోళ్లు చేస్తార్లే అన్న పాలేకర్ వ్యవసాయం నేడు పట్టభద్రుల దగ్గరనుంచి 70, 80 సంవత్సరాల వృద్ధుల వరకూ చేస్తున్నారని ఈ సమావేశం రుజువులతో సహా నిరూపించింది. అన్ని రకాల పంటల్లోనూ వారి విజయాలు, వాటిని వారు వివరిస్తున్న తీరు మరెవరూ ప్రశ్నించలేని విధంగా ఉంది. పాలేకర్ వ్యవసాయంలో నీరు, విద్యుత్ కేవలం ఇప్పుడు వాడుతున్న దానిలో 10 శాతం మాత్రమే అవసరమవుతుంది. అదెలా అంటే చెప్పడం చాలా సింపుల్. చేపలు పట్టివ్వడం కాదు, పట్టడం నేర్పు అన్నది ఒక చైనా సామెత. ఇదీ అంతే! మొక్క మొదటికి నీవు నీరందించడం కాదు... నీరు ఎక్కడ లభిస్తుందో అక్కడకు అంటే భూమి లోతుల్లోకి మొక్కల వేర్లు వెళ్లేలా చేయడం పాలేకర్ విధానంలో నీటి ఆదాకు ప్రధాన సూత్రం. అలాగే చీడపీడల విషయంలో కూడా ఆయన చెప్పేది చాలా సింపుల్. ఏ తెగులు, పురుగు ఊరకనే మీ పంటపై దాడిచేయదు. మీరు చేసే తప్పులే చీడపీడలను పెంచుతాయి. వాటిని అరికట్టేందుకు పాలేకర్ వద్ద అనేక టెక్నిక్‌లు ఉన్నాయి. లీటర్ రెండు వేలు పెట్టి కొనే తెగులు మందుకంటే.. మీ ఇంట్లో మూడు రోజులు పులిసిన పుల్లమజ్జిగ పవర్‌ఫుల్ అంటారు పాలేకర్. కావాలంటే పరీక్షించుకోమని సవాల్ విసురుతారు.

సాధ్యాసాధ్యాలు తెలియాలంటే పాలేకర్ శిక్షణలో పాల్గొనాల్సిందే. అది ఒకరు చెబితే అబ్బేది కాదు. చేస్తేనే తెలుస్తుంది కానీ చూస్తే అర్థం కాదు. ఇక ఈ విధానం రైతుకు అన్ని విధాలా లాభమే. ఏ వస్తువు కోసం రైతు డబ్బు తీసుకుని సమీపంలోని పట్టణానికి పోకూడదు. పట్టణవాసులే తమ ఆహారాన్ని వెతుక్కుంటూ డబ్బు తీసుకుని పల్లెకు వెళ్లాలి. ఇదీ పాలేకర్ విధానంలో మూలసూత్రం. దానికి ఆయన ప్రాక్టికల్ విధానాలను చూపుతారు. ఈ పురుగుమందులు, ఎరువులు, హైబ్రిడ్ విత్తనాలు అన్నీ వేస్ట్ అంటారు. అడవిలో చింతచెట్టు, మామిడి చెట్లకు ఎవరూ ఎన్ పి కె అందించకపోయినా, నీరు పెట్టకపోయినా, పురుగు మందు కొట్టకపోయినా క్వాలిటీ కలిగిన భారీ ఫలసాయాన్ని అందిస్తాయని గుర్తుచేస్తారు. అడవిలో ఏ చెట్టు ఆకు తీసుకుని లాబ్‌లో పరీక్షించినా ఏ పోషకాల లోపం ఉండదనీ... మరి వాటికి పోషకాలను ఎవరు అందించారన్నది పాలేకర్ ప్రశ్న. అలాగని అదేమీ తర్కానికి నిలవని గుడ్డి నమ్మిక కాదు సుమా..! అడవిలోని చెట్టుకూ... మన చేలోని మొక్కకూ పోలికేంటబ్బా అనుకుంటూ మీ బుర్రలో తలెత్తే ప్రతి ప్రశ్నకూ పాలేకర్ వద్ద సశాస్త్రీయమైన సమాధానం ఉంది. మన దేశీయ విత్తనాలు, దేశీయ ఆవు, మన చుట్టూ ఉంటే చెట్టూ చేమా, మొక్కా మోడే మన వ్యవసాయ అవసరాలు. ఈ క్రమంలో ఏర్పాడే ప్రతి అనుమానాన్ని సూక్ష్మంగా చర్చిస్తారాయన. ప్రతి నేలకు, ప్రతి పంటకు సరిపడిన పంటలు, అంతర పంటలు, మిత్ర పంటలు, శత్రు పంటలు వివరిస్తారు. పాలేకర్ విధానం వందశాతం ఫాలో అయితే చాలు... రెండేళ్లలో మీ సాగు లాభాలపట్టాలపై పరుగులు తీస్తుంది. వ్యవసాయం చేసిన వాడు ఎవడూ ఆత్మహత్య అన్న ఆలోచనే చేయడు. ఎందుకంటే పాలేకర్ విధానం అనేది మహారాష్ట్రలోని మహా కరువు ప్రాంతం, ఈ దేశంలో రైతులు ఎక్కువగా ఆత్మహత్యలు చేసుకునే ప్రాంతమైన మరఠ్వాడాలో పుట్టింది. ఆయన అక్కడి వాడే. అందుకే అందులో కరువును ఎదుర్కొనే పద్దతులన్నీ ఇమిడి ఉన్నాయి.

ఇప్పటివరకూ పాలేకర్ వ్యవసాయ విధానాన్ని ఏ ప్రభుత్వమూ ఇంత బాహాటంగా సపోర్ట్ చేయలేదు. మరి చంద్రబాబు ప్రభత్వం ఎందుకు ప్రమోట్ చేస్తున్నట్టంటారా? బాబు ఎంతైనా తెలివైన వాడు కదా. రైతుల ఆత్మహత్యలు ప్రభుత్వాలు ఆపలేవని ఆయనకు తెలుసు. అలాగే ప్రభుత్వాలు, వేలు, లక్షల కోట్ల ఎరువులు, విత్తనాలు, వ్యవసాయ పరికరాలపై సబ్సిడీగా ఇవ్వాల్సి వస్తోంది. పాలేకర్ విధానంలో ఇవేమీ అవసరం లేదు. ఏ సభలో అయినా ముఖ్యమంత్రి వచ్చి ఏమి కావాలని అడిగితే సభికుల కోర్కెల చిట్టాకు పుల్ స్టాప్ ఉండదు. కానీ ఇక్కడకొచ్చిన ముఖ్యమంత్రి వేలమంది రైతులను ఏం కావాలని అడిగితే... కేవలం ఒక్కో రైతుకు ఒక్కో దేశీయ ఆవు, ఈ విధానంలో పండించిన పంటకు ఇది ఆరోగ్యకరమైనదన్న సర్టిఫికేట్ ఇస్తే చాలన్నారంటే... రైతు అవసరాలు ఈ విధానంలో ఎంత పరిమితమో అర్థం చేసుకోవచ్చు. వెంటనే ముఖ్యమంత్రి పదివేల సబ్సిడీతో దేశీయ ఆవులను ఇస్తామని సభలోనే ప్రకటించారు. సర్టిఫికేట్ ముంబైవెళ్లి డబ్బుకట్టి తెచ్చుంటున్నామన్న ఆవేదనకు స్పందిస్తూ ... ప్రభుత్వమే ఉచితంగా సర్టిఫికేట్ ఇచ్చే విధానాన్ని ఆరు నెలల్లోనే అందుబాటులోకి తెస్తామని ప్రకటించారు. కేంద్రప్రభుత్వం కూడా ఈ సభకు వ్యవసాయశాఖ సెక్రటరీ రాణీ కుముదినీని పంపి రైతుల స్పందనను అధ్యయనం చేయడం ఈ కార్యక్రమంలో మరో ముఖ్యమైన హైలైట్. ఈ విధానం బాగా పాపులర్ అయితే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ బడ్జెట్‌లలో వ్యవసాయానికి కేటాయింపులను లక్షల కోట్ల నుంచి వేలకోట్లకు తగ్గించుకోవచ్చు. అయితే బహుళజాతి విత్తన, ఎరువులు, పురుగుమందుల కంపెనీల లాబీకి ప్రభుత్వాలు లొంగకుండా ఉంటేనే ఇది సాధ్యమవుతుందనుకోండి. పాలేకర్ విధానాన్ని ప్రోత్సహించేందుకు కృతనిశ్ఛయంతో ఉన్నానన్న చంద్రబాబు దీనికోసం ఒక కమిటీని కూడా ఏర్పాటుచేశారు. పాలేకర్‌తో పాటు ఏపీ వ్యవసాయశాఖ స్పెషల్ చీఫ్‌ సెక్రటరీ విజయ్‌కుమార్, ప్రముఖ శాస్త్రవేత్త ఆలపాటి సత్యనారాయణ, వ్యవసాయశాఖ మంత్రి పుల్లారావులకు ఈ కమిటీ బాధ్యతలు అప్పగించారు. ప్రతి నెలా 10 రోజులు ఏపీలోనే ఉండాలన్న ముఖ్యమంత్రి వినతికి పాలేకర్ కూడా సుముఖత వ్యక్తంచేశారు. త్వరలోనే ఏపీ ప్రభుత్వం పాలేకర్ విధానంపై ముందుకు వెళ్లేందుకు ఒక రోడ్ మ్యాప్ సిద్ధంచేయనుంది. దీనిని పాలేకరే స్వయంగా పర్యవేక్షించనున్నట్టు తెలిసింది.

అన్నట్టు ఈ కార్యక్రమం మధ్యలోనే పాలేకర్‌కు కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ ప్రకటించింది. దీంతో పాలేకర్ విధానానికి ఒక రకంగా దేశ నాయకత్వం ఆమోదం లభించిందన్న భావన సర్వత్రా వ్యక్తమయ్యింది. ఈ సందర్భంగా సన్మానాలు సరే సరి. పాలేకర్ శిష్యులు ఆయనకు పాదాభివందనాలు చేస్తూ తమ భక్తిని చాటుకున్నారు. ముఖ్యమంత్రే నేరుగా వచ్చి పాలేకర్‌ను ఏపీ ప్రభుత్వం తరపున అధికారికంగా సత్కరించారు. ఈ సందర్భంగా రైతులు ఒక డిమాండ్ వినిపించారు. అది వింటే రైతులు ఎంత తెలివైన వారో అనిపిస్తుంది సుమా... ( ఒక రైతు.... పాలేకర్ కు ప్రభుత్వం వెంటనే రక్షణ కల్పించాలని కోరడం. లక్షల కోట్లు కోల్పోయే బహుళజాతి వ్యవసాయ కంపెనీల వల్ల పాలేకర్‌కు ఇబ్బందులు ఉంటాయని చెప్పడం). పాలేకర్ జీరో బడ్జెట్ ప్రాకృతిక ఆధ్యాత్మిక వ్యవసాయం గురించి ఓ పది రోజులైనా వెచ్చిస్తే తప్ప ఒక అవగాహనకు రాలేం. మరి ఈ పది నిముషాల్లో దాని గురించి చెప్పాలని భావించడం సాహసమే అవుతుంది. అన్నట్టు ఆధ్యాత్మిక వ్యవసాయం అన్నారు కదా అని నాస్తికులకు దూరం అనుకునేరు. నాస్తికులు, హేతువాదులకే పాలేకర్ వ్యవసాయ విధానం మరింత నచ్చుతుంది. దీని గురించి తెలుసుకోవాలంటే ఆయన లిటరేచర్ పూర్తిగా చదివి... శిక్షణకు హాజరయితేనే సాధ్యం. అక్కడితో మన అనుమానాలు పటాపంచలు అయిపోతాయి. పైగా మీరు ఏ పంట వేద్దామనుకుంటున్నారో అదే పంటను ఇప్పటికే పాలేకర్ విధానంలో సాగుచేస్తున్న మార్గదర్శకులు మీకు అక్కడ కోకొల్లలుగా తారసపడతారు. రారమ్మంటూ వారి క్షేత్రానికి ప్రేమపూర్వంకంగా ఆహ్వానిస్తారు. మీకు తెలుసా... కర్ణాకలో కృష్ణప్ప అనే రైతు పాలేకర్ విధానంలో కొబ్బరి దాని అనుబంధ పంటలు పండిస్తూ ఎకరాకు లక్షల్లో ఆర్జిస్తున్నారు. యూట్యూబ్‌లో ఆ వీడియోలు ఉన్నాయి. సందర్శకుల తాకిడి తట్టుకోలేక మనిషికి వెయ్యి రూపాయల టిక్కెట్ కూడా ఆయన పెట్టారట. అయినా... ఆయనను వ్యవసాయం చేసుకోనిస్తే ఒట్టట.... ఏంటి మీకు కూడా ఆసక్తిగా ఉందా... మరైతే వెతకండి పాలేకర్ పుస్తకాలు ఎక్కడున్నాయో..! ఆ‍యన శిక్షణ ఎక్కడుందో..! నెట్‌లో సెర్చ్ చేయండి... యూట్యూబ్‌లో చూడండి.. ఆపై అభ్యసించి ఆచరించండి.. మీరు ఆరోగ్యంగా ఆనందంగా జీవిస్తూ సమాజానికి ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించండి. ఆరోగ్యం, ఆనందం మాత్రమేనా... మరి డబ్బులో అంటారా..! పాలేకర్ విధానంలో ఖర్చు ఉండదండి బాబూ... అంతా ఆదాయమే.... అర్థం చేసుకోరూ..... ఆల్ ది బెస్ట్.....

Saturday, 28 January 2017

సమరమా.. సఖ్యతా!

సమరమా.. సఖ్యతా!
29-01-2017 01:33:37



ఆర్కే కొత్తపలుకు
 గుంపుస్వామ్యంలో పడి ప్రజలు కొట్టుకుపోతున్నప్పుడు వారిని హెచ్చరించడం మీడియా బాధ్యత. ఇలాంటి సందర్భాలలో నిందలు భరించాల్సి రావచ్చు. అయినా జంక కూడదన్నది నా అభిప్రాయం. అందుకే గతంలో కూడా ఉద్యమించడం కాకుండా, ఏపీ హక్కుల కోసం పోరాడాలని సూచించా. అప్పుడు సమైక్య ఉద్యమంలో కనిపించిన ముఖాలే అటూ ఇటుగా ఇప్పుడు ప్రత్యేక హోదా ఉద్యమంలోనూ కనబడుతున్నాయి. ఇప్పుడు ఏపీ ప్రజలు పోరాడాల్సింది రాని, ఉపయోగం లేని ప్రత్యేక హోదా కోసం కాదు. ప్రకటించిన ప్రత్యేక ప్యాకేజీకి చట్టబద్ధత కల్పించాలని పోరాటం చేయాలి.

                   ప్రత్యేక హోదా పేరిట ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాలు మళ్లీ వేడెక్కాయి. పొరుగు రాష్ట్రమైన తమిళనాడులో జల్లికట్టు ఆటను నిషేధించడాన్ని నిరసిస్తూ వేల మంది యువత మెరీనా బీచ్‌ను ఆక్రమించడాన్ని స్ఫూర్తిగా తీసుకుని విశాఖపట్టణంలోని ఆర్‌.కె. బీచ్‌లో కూడా తెలుగు యువత నిరసన వ్యక్తంచేయాలని ప్రతిపక్షాలు పోటీపడి పిలుపులు ఇచ్చాయి. ముందుగా ఈ తరహా పిలుపు ఇచ్చింది జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ కాగా, తానెక్కడ వెనుకబడిపోతానోనని ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్‌రెడ్డి ఆ వెంటనే రంగంలోకి దిగారు. తమిళ సినిమాలను కాపీ కొట్టే మన తెలుగు హీరోలు ఉద్యమాలను కూడా కాపీ కొట్టడానికి ప్రయత్నించి విఫలమయ్యారు. జల్లికట్టు ఉద్యమానికి తమిళ సినిమా పరిశ్రమ మద్దతు ప్రకటించడంతో, ప్రత్యేక హోదా గురించి సరైన అవగాహన కూడా లేని కొంతమంది తెలుగు హీరోలు, ఇతర ప్రముఖులు అదే దారిలో విశాఖ తీరంలో తలపెట్టిన నిరసనలకు మద్దతు ప్రకటించారు. ముష్టిలో వీర ముష్టి అన్నట్టుగా తమిళ ఉద్యమాన్ని కాపీ కొట్టడానికి పవన్‌ కల్యాణ్‌ ప్రయత్నిస్తే, ఆయన ఇచ్చిన పిలుపును ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్‌రెడ్డి కాపీ కొట్టారు. ఎవరిని ఎవరు కాపీ కొట్టారన్న విషయం పక్కనపెడితే, గణతంత్ర దినోత్సవం రోజున నిరసన కార్యక్రమాలు చేపట్టాలని ప్రతిపక్షాలు భావించడం వ్యూహాత్మక తప్పిదమనే చెప్పాలి. అంతే కాకుండా పెట్టుబడుల కోసం విశాఖలో ఇన్వెస్ట్‌మెంట్‌ సమ్మిట్‌ నిర్వహిస్తున్న సమయంలోనే నిరసనల ద్వారా ఉద్రిక్తతలు సృష్టించాలనుకోవడం ప్రతిపక్షాల బాధ్యతారాహిత్యమే అవుతుంది.

              నిజానికి ప్రత్యేక హోదా అనేది ఏపీలో ముగిసిపోయిన అధ్యాయం. పాచిపోయిన నినాదాన్ని అందిపుచ్చుకుని బల ప్రదర్శనకు ప్రతిపక్షాలు ప్రయత్నించాయి. ప్రత్యేక హోదా ఇవ్వాలనుకుంటే కేంద్ర ప్రభుత్వం ఇప్పుడైనా ఇవ్వవచ్చుననీ, అలా ఇచ్చినా ఉపయోగం కూడా ఏమీ ఉండకపోవచ్చుననీ 14వ ఆర్థిక సంఘం చైర్మన్‌గా పనిచేసిన యాగా వేణుగోపాల్‌రెడ్డి ఇటీవలే స్పష్టంచేశారు. వాస్తవానికి ప్రత్యేక హోదా పొందే అర్హతలు ఏపీకి లేవు. ఈ విషయాన్ని నేను గతంలోనే స్పష్టంచేశాను. కొండ ప్రాంతాలతో కూడి ఉండి, ఆర్థికంగా కునారిల్లే రాష్ర్టాలకు మాత్రమే ప్రత్యేక హోదా ఇచ్చారు. అంతమాత్రాన అక్కడ పరిశ్రమలు ఏర్పాటైఆ రాష్ర్టాల ఆర్థిక పరిస్థితులు ఏమీ మెరుగుపడలేదు. సొంత వనరులు లేని ఆ రాష్ర్టాలు కేంద్రం ఇచ్చే నిధులపై ఆధారపడి రోజులు నెట్టుకొస్తున్నాయి గానీ అభివృద్ధి పథంలో దూసుకెళ్లడం లేదు. పరిశ్రమల ఏర్పాటుకు రాయితీలు లభించాలంటే హోదాతో పాటు ప్రత్యేకంగా మరో నోటిఫికేషన్‌ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఇలాంటి వెసులుబాటు పొందిన ఉత్తరాఖండ్‌లో రాయితీల కోసం బోగస్‌ కంపెనీలు ఏర్పాటు అయ్యాయి. తెలుగు రాష్ర్టాలకు చెందిన కొన్ని ఫార్మా కంపెనీలు కూడా అక్కడ బ్రాంచ్‌లను మాత్రమే తెరిచి కంపెనీలు పెట్టినట్టుగా రికార్డులలో చూపించి రాయితీలు పొందాయే గానీ పెట్టుబడులు పెట్టిందీ లేదు-– ఉద్యోగాల కల్పన చేసిందీ లేదు.

             ఈ కారణంగానే ఉత్తరాఖండ్‌ ఇప్పటికీ వెనుకబడి ఉంది. నిజంగా పరిశ్రమలు ఏర్పాటుచేసేవారు హోదా ఉందా లేదా అని చూడరు. ఇప్పుడు దేశంలో పారిశ్రామికంగా, వ్యాపారపరంగా అభివృద్ధి చెందిన ఏ రాష్ర్టానికికూడా ప్రత్యేక హోదా లేదు. వ్యాపారానికి, వస్తు ఉత్పత్తికి అనుకూలతలు ఉండటంతో పాటు లాభాలు వస్తాయనుకున్నప్పుడే ఏ పారిశ్రామికవేత్త అయినా పెట్టుబడులు పెడతారు. ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్‌రెడ్డి కూడా ఏ హోదా లేకపోయినా కడప జిల్లాలో సిమెంట్‌ ఫ్యాక్టరీ ఏర్పాటుచేశారు. కర్ణాటకలో విద్యుత్‌ కేంద్రం నెలకొల్పారు.

విపక్ష స్థానానికీ ముప్పొస్తే..
అయినా మరుగునపడిపోయిన ప్రత్యేక హోదా నినాదం ఇప్పుడు మళ్లీ తెర మీదకు ఎందుకు వచ్చినట్టు? ఇందుకు కారణం ప్రజల ప్రయోజనాల కంటే రాజకీయ ప్రయోజనాలే ప్రధానం అని స్పష్టంగా చెప్పవచ్చు. ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాలలో జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ క్రియాశీలకంగా వ్యవహరించాలని నిర్ణయించుకున్నారు. జగన్‌ సొంత మీడియా మినహా మిగతా మీడియాలో ఆయన వార్తలకు తగిన ప్రాధాన్యం లభిస్తోంది. ఈ పరిణామం అధికారపక్షమైన తెలుగుదేశం పార్టీ కంటే ప్రతిపక్షమైన వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీనే ఎక్కువ ఇబ్బందికి గురిచేస్తోంది. పవన్‌ కల్యాణ్‌కు తెలుగుదేశం పార్టీతో సంబంధాలు ఇంకా పూర్తిస్థాయిలో దెబ్బతినలేదు. శ్రీకాకుళం జిల్లా ఉద్దానం కిడ్నీ బాధితుల సమస్యను పవన్‌ కల్యాణ్‌ హైలైట్‌ చేయగానే చంద్రబాబు ప్రభుత్వం స్పందించింది. వైద్యపరంగా కొన్ని చర్యలు చేపట్టింది. దీంతో ప్రభుత్వంతో సమస్యలు ఉన్నవారు పవన్‌ కల్యాణ్‌ను ఆశ్రయించడం మొదలుపెట్టారు. ప్రతిపక్ష నాయకుడైన తన వద్దకు రాకుండా సమస్యలు చెప్పుకోవడానికి పవన్‌ కల్యాణ్‌ వద్దకు ప్రజలు వెళ్లడం జగన్మోహన్‌రెడ్డిని సహజంగానే కలవరానికి గురిచేసింది.

               పరిస్థితులు ఇలాగే కొనసాగితే తన ప్రతిపక్ష స్థానానికే ప్రమాదం ముంచుకువస్తుందని జగన్మోహన్‌రెడ్డి ఆందోళనకు గురై ఉంటారు. దీంతో ఏపీలో ప్రతిపక్ష పాత్ర కోసం పోటీ మొదలయ్యింది. దీని పర్యవసానమే విశాఖ తీరంలో తలపెట్టిన నిరసన ఉద్యమాలు. తమిళనాడులో జల్లికట్టు ఉద్యమం సక్సెస్‌ కావడంతో అదే తరహాలో ఏపీలో ప్రత్యేక హోదా ఉద్యమం చేపట్టాలని పోటీపడటం మొదలయ్యింది. తమిళ ప్రజలు రెండు రోజుల్లోనే జల్లికట్టు ఆటకు అనుమతి పొందగా లేనిది, మనం ప్రత్యేక హోదా కోసం ఉద్యమించి సాధించుకోలేమా? అని కాంగ్రెస్‌ ఎంపీ కేవీపీ రామచంద్రరావు తొలుత పిలుపు ఇచ్చారు. అయితే ఏపీలో అవశేషంగా మాత్రమే మిగిలి ఉన్న కాంగ్రెస్‌ పార్టీ ఆ పిలుపును ఉపయోగించుకోలేకపోయింది. కేవీపీ పిలుపును ప్రజలు కూడా పట్టించుకోలేదు. పవన్‌ కల్యాణ్‌ మాత్రం స్పందించారు.

           ప్రత్యేక హోదా కోసం మీరు విశాఖ తీరంలో నిరసన చేపడితే నేను మద్దతు ఇస్తానని ట్విట్టర్‌ ద్వారా యువతకు పిలుపు ఇచ్చారు. ఈ అంశం మీడియాలో ప్రముఖంగా రావడంతో ఉలిక్కిపడిన ప్రతిపక్ష నేత జగన్మోహన్‌రెడ్డి, తానెక్కడ వెనుకబడిపోతానోనని విశాఖ తీరంలో రిపబ్లిక్‌ డే రోజున కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించబోతున్నట్టు ప్రకటించారు. ఉద్యమాలు కోరుకునే కమ్యూనిస్టు పార్టీలు మేం కూడా అంటూ స్పందించాయి. ఇక్కడ కమ్యూనిస్టు పార్టీలు భిన్న మార్గాలలో పయనిస్తున్నాయి. సీపీఐ నాయకులు జనసేన పార్టీతో కలిసి పయనించడానికి మొగ్గు చూపుతుండగా, సీపీఎం నాయకులు మాత్రం వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌తో జత కట్టడానికి ఉత్సాహపడుతున్నారు. ఈ రాజకీయ పార్టీలతోపాటు కొన్ని స్వయం ప్రకటిత సంఘాలు, వాటి నాయకులుగా చలామణి అవుతున్నవారు కూడా ప్రత్యేక హోదా పాటను అందిపుచ్చుకున్నారు. జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ కేవలం విశాఖ తీరాన్ని వేదికగా ఎంచుకోగా, జగన్మోహన్‌రెడ్డి విశాఖతోపాటు విజయవాడ, తిరుపతిలో కూడా నిరసనలకు పిలుపు ఇచ్చారు. ఇందులో తమ పాత్ర ఏమీ లేకుండాపోతున్నదని ఆందోళనకు గురైన కాంగ్రెస్‌ పార్టీ, గాంధీ విగ్రహాల వద్ద మౌనదీక్షలకు పిలుపు ఇచ్చింది. మొత్తానికి ప్రతిపక్షాలన్నీ కలివిడిగా, విడివిడిగా వాంఛనీయం, సమర్థనీయం కాని రోజును, ప్రాంతాన్ని నిరసనలకు ఎంచుకోవడంతో ప్రభుత్వం కూడా కఠినంగానే వ్యవహరించింది. ఫలితంగా విశాఖ తీరంలో ఉద్రిక్తత నెలకొన్నప్పటికీ, నిరసనలకు అవకాశం మాత్రం లేకుండా పోయింది.

అదే శాపం!
ఈ మొత్తం క్రీడలో విషాదం ఏమిటంటే ఏపీ ప్రజల ప్రయోజనాలు బలి కావడం! అదేమి శాపమో గానీ గతంలోనూ, ప్రస్తుతం కూడా సీమాంధ్రులను తప్పుదారి పట్టించే నాయకులే వారికి లభిస్తున్నారు. తమిళనాడు నుంచి వేరుపడినప్పుడు మద్రాస్‌ నగరం కూడా కావాలని కోరడంతో తమిళుల ఆగ్రహానికి గురయ్యారు. అప్పుడే అలాంటి విపరీత కోరిక కోరే బదులు రాజధాని లేని తమకు న్యాయం చేయమని కేంద్ర ప్రభుత్వాన్ని కోరి సహాయం పొంది ఉండవలసింది. అలా జరగకపోవడంతో కర్నూలు రాజధానిగా గుడారాలు వేసుకుని పాలన సాగించారు. గుడారాలలో ఎంత కాలం ఉంటామనుకుని హైదరాబాద్‌పై కన్నేసి తెలంగాణవారితో కలిసిపోయారు. అప్పుడే పట్టుదలగా కష్టపడి ఉంటే ఏపీ ఇవ్వాళ ఎంతో అభివృద్ధి చెంది ఉండేది. హైదరాబాద్‌ రాజధానిగా ఏర్పడిన ఉమ్మడి రాష్ర్టాన్ని పాలించిన సీమాంధ్ర నాయకులు తమ దృష్టినంతా హైదరాబాద్‌పైనే కేంద్రీకరించి సీమాంధ్ర అభివృద్ధిని విస్మరించారు. ఫలితంగానే ఎంతో అవకాశం ఉన్నప్పటికీ విశాఖ నగరం అంతగా అభివృద్ధి చెందలేదు. ఈ క్రమంలోనే ప్రత్యేక తెలంగాణ ఉద్యమం రావడం, పుష్కరం పాటు పాలకుల ప్రాధాన్యాలు తెలంగాణకే పరిమితం కావడం జరిగింది.

            చివరకు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుచేస్తున్నట్టు ప్రకటించినప్పుడు కూడా హేతుబద్ధంగా ఆలోచించి సాధించుకోవలసిన వాటి గురించి ఆలోచించకుండా హైదరాబాద్‌ కావాలని కొన్ని రోజులు, సమైక్య రాష్ట్రమే ముద్దు అంటూ కొన్ని రోజులు వృథా చేసుకున్నారు. సమైక్య ఉద్యమం జోరు మీద ఉన్నప్పుడు కూడా ‘విభజన అనివార్యం- మీకు కావలసిన వాటి కోసం పోరాడండి’ అని నేను స్పష్టంగా సూచించాను. అప్పుడు ఇటువంటి హితోక్తులు ఎవరి చెవికీ ఎక్కలేదు. సమైక్య ఉద్యమానికి ఒక వర్గం మీడియా వంత పాడటమే కాకుండా ఏపీకి రావలసిన వాటి గురించి మాట్లాడటానికి ప్రయత్నించిన నాయకులను ఎగతాళి చేస్తూ ప్రసారాలు చేసింది. చివరకు ఏమైంది? ఏమీ సాధించుకోకుండానే విడిపోవలసి వచ్చింది. నష్టపోయింది ఎవరు? నాయకులు కాదు-– ప్రజలే! ప్రత్యేక హోదా ఏమి ఖర్మ- ఆ రోజున ఏమి కావాలన్నా ఇవ్వడానికి సోనియాగాంధీ మానసికంగా సిద్ధపడ్డారు. కానీ ఆ అవకాశాన్ని వినియోగించుకోకుండా కొంతమంది నాయకులు, ఒక వర్గం మీడియా కలిసి అడ్డుకున్నాయి. దీంతో దిక్కూదివాణం లేకుండా ఆంధ్రప్రదేశ్‌ ఏర్పడింది. అలాంటి రాష్ట్రంలో ఇప్పుడు జరుగుతున్నదేమిటి? కులాల కుమ్ములాటలు, వర్గ పోరు! పరిశ్రమల ఏర్పాటు కోసం హోదా కోరుతున్నామని గొంతు చించుకుంటున్నవారు పరిశ్రమల ఏర్పాటుకు అనువైన వాతావరణాన్ని సృష్టిస్తున్నామా? లేదా? అని గుండె మీద చేయి వేసుకుని ఆలోచించుకోవాలి. అధికారంలో ఇవ్వాళ చంద్రబాబు ఉండవచ్చు. రేపు మరొకరు ఉండవచ్చు. కానీ ఏపీ అభివృద్ధికి ఇప్పుడు పడే పునాదే ఆ రాష్ట్ర భవిష్యత్తుకు ప్రధానం అవుతుంది. సకల హంగులతో అలరారుతున్న హైదరాబాద్‌ను కాదని ఎవరైనా ఏపీలో పరిశ్రమలు పెట్టాలంటే ఆషామాషీగా జరగదు.

             దీనికి ఎంతో కృషి అవసరం. భాగస్వామ్య సదస్సు పేరిట వివిధ రాష్ర్టాల పారిశ్రామికవేత్తలను ఆకర్షించడానికి పోటీపడుతున్న నేపథ్యంలో పాచిపోయిన నినాదాలతో ఉద్రిక్తతలు సృష్టించడం ఏపీ అభివృద్ధికి సహకరించడం అవుతుందా? నిర్దిష్టమైన ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి వెళ్లేటట్టు చేసి, వాటి పరిష్కారానికి కృషి చేస్తున్న పవన్‌ కల్యాణ్‌ కూడా ప్రత్యేక హోదా విషయంలో తొందరపడ్డారేమోనని అనిపిస్తోంది. చంద్రబాబును, ఆయన ప్రభుత్వాన్ని తప్పుబట్టడానికి ఎన్నో అవకాశాలు ఉన్నాయి. వాటిని కాదనుకుని కేంద్ర ప్రభుత్వంతో ఘర్షణ పడమని ఒత్తిడి తేవడం ఏపీ ప్రజలకు ద్రోహం చేయడమే అవుతుంది.

అండ లేకుండా అయ్యే పనేనా?
ప్రతిపక్షాలు కోరుతున్నట్టుగా తెలుగుదేశం ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో ఘర్షణకు దిగుతుందనే అనుకుందాం. అప్పుడు ఏమి జరుగుతుంది? ఏపీకి ప్రత్యేక హోదా వస్తుందా? ఒకవేళ ఇచ్చినా ఏపీ అభివృద్ధికి కేంద్రం సహకరిస్తుందా? పోలవరం ప్రాజెక్టు పూర్తికి సకాలంలో నిధులు అందిస్తుందా? ప్రత్యేక హోదా మాత్రమే కావాలని మంకుపట్టుపట్టి ఉంటే పోలవరం ప్రాజెక్టు కోసం సుమారు 16 వేల కోట్ల రూపాయలు నాబార్డు ద్వారా మంజూరు చేసి ఉండేవారా? తొలి ఏడాది బడ్జెట్‌లో పెట్టినట్టుగా ఏటా వంద కోట్లు లేదా రెండు వందల కోట్లు ఇస్తూ పోయేవారు. అదే జరిగితే ఈ తరమే కాదు వచ్చే తరం కూడా ఆ ప్రాజెక్టు పూర్తికావడాన్ని చూసేది కాదు. ప్రత్యేక హోదా ఉండే రాష్ర్టాలలో విదేశీ ఆర్థిక సహకారంతో చేపట్టే ప్రాజెక్టులు, పథకాల భారాన్ని కేంద్ర ప్రభుత్వమే భరిస్తుంది. హోదా ప్రకటించకపోయినా ఏపీకి ఈ వెసులుబాటు ఇస్తున్నట్టు కేంద్రం ప్రకటించింది. ఈ వెసులుబాటును ఉపయోగించుకుని ఏపీలో పలు ప్రాజెక్టులకు రూపకల్పన చేసి కేంద్రం ఆమోదం పొందడానికి కృషి చేయాలే గానీ హోదా ఇస్తే చాలు అని ప్రజలను తప్పుదారి పట్టించడం సమర్థనీయం కాదు. హోదా ఇచ్చినా విదేశీ ఆర్థిక సహాయంతో చేపట్టే ప్రాజెక్టులకు కేంద్రం ఆమోదం తెలపకపోతే ఏమిటి పరిస్థితి? ఇదంతా ఎందుకు-– ఏపీ ఇప్పుడున్న పరిస్థితులలో కేంద్రంతో ఘర్షణకు దిగి మనుగడ సాగించలేదు. ప్రధాని నరేంద్ర మోదీ మనస్తత్వం తెలిసినవారెవ్వరూ ఆయనతో సున్నం పెట్టుకోవాలని సూచించరు. బిహార్‌ ఎన్నికల సందర్భంగా లక్షా 45 వేల కోట్ల రూపాయల ప్యాకేజీ ప్రకటించిన నరేంద్ర మోదీ ఆ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ ఓడిపోవడంతో ఒక్క రూపాయి కూడా ఇవ్వడం లేదు.

               అధికారంలోకి వచ్చిన కొత్తలో ‘మోదీ లేదు- గీదీ లేదు’ అని వ్యాఖ్యానించిన తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు తత్వం బోధపడిన తర్వాత, ప్రధానితో స్నేహంగా ఉంటున్నారు. పెద్ద నోట్ల రద్దు వల్ల ఒనగూరిన ప్రయోజనం ఏమీ లేకపోయినా నరేంద్ర మోదీతో గొడవ ఎందుకన్న ఉద్దేశంతో ఆయన నిర్ణయాన్ని కేసీఆర్‌ బాహాటంగా సమర్థించారు. నిజానికి కేంద్ర సహకారం లేకపోయినా తెలంగాణ రాష్ట్రం మనుగడ సాగించగలదు. అయినా కేంద్రం నుంచి గరిష్ఠంగా సహాయం పొందాలన్న దృక్పథంతో కేసీఆర్‌ తన వైఖరి మార్చుకున్నారు. విజ్ఞతతోపాటు రాష్ర్టాభివృద్ధి పట్ల చిత్తశుద్ధి ఉన్నవారు ఎవరైనా ఇదే చేస్తారు. ఏపీ ప్రజలారా... ఇప్పుడు చెప్పండి కేంద్రంతో యుద్ధం చేసి నష్టపోవడమా? సఖ్యతతో మెలుగుతూ రాష్ర్టానికి కావలసిన వాటిని సాధించుకోవడమా? నిర్ణయం ప్రజల చేతుల్లోనే ఉంది.

కులంపై గళమెత్తాలి!
ఏపీలో చోటుచేసుకుంటున్న పరిణామాలను చూసి పొరుగున ఉన్నవారు నవ్వుకునే పరిస్థితులు తెచ్చుకోవద్దు. ఇప్పటికే సీమాంధ్రను వదిలించుకుని మంచి పని చేశామనీ, లాభపడ్డామనీ తెలంగాణ ప్రజలు భావిస్తున్నారు. ‘ముఖ్యమంత్రి మీదే చేయి వేస్తారా’ అని పోలీసు అధికారులపై మండిపడ్డ ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్‌రెడ్డి లక్ష్యం ముఖ్యమంత్రి కావడమే! ముఖ్యమంత్రి కావాలని ఆయన కోరుకోవడం కూడా తప్పు కాదు. ఏ రాజకీయ పార్టీ అంతిమ లక్ష్యమైనా అధికారంలోకి రావడమే. అయితే ముఖ్యమంత్రిని అని భ్రమల్లో జీవించడమే అవివేకం. ప్రత్యేక హోదా విషయంలో కేంద్ర ప్రభుత్వం మాట తప్పిన విషయం వాస్తవం. అందుకు ప్రత్యామ్నాయంగా గరిష్ఠంగా సహాయం చేస్తామని చెబుతున్నప్పుడు అందిపుచ్చుకోవాలా? లేదా? అనేది ఏపీ ప్రజలే నిర్ణయించుకోవాలి. విభజన చట్టంలో పేర్కొన్న పలు విద్యాసంస్థలతోపాటు, ఇతర సంస్థలను నెలకొల్పడానికి ఇప్పటివరకు కేంద్రం చురుగ్గానే పనిచేస్తోంది. చట్టంలో పేర్కొన్నంత మాత్రాన ఆయా సంస్థలను వెంట వెంటనే ఏర్పాటుచేయాలని ఏమీ లేదు. పదేళ్లలో ఏర్పాటు చేయాలని చట్టంలోనే ఉంది. కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడిని ప్రత్యేక హోదా విషయంలో విమర్శించేవారు ఉండవచ్చు గానీ, కేంద్రం నుంచి ఏపీకి సహాయం సాధించుకురావడంలో ఆయన కృషిని మాత్రం విస్మరించలేం! కేంద్ర ప్రభుత్వంలో ఉండే అధికారులకు ఏపీ పట్ల ప్రత్యేక శ్రద్ధ గానీ, నష్టపోతారన్న ఆవేదన గానీ ఎందుకుంటుంది? వారి వెంటపడి పనులు చేయించుకోవలసిన బాధ్యత ఏపీ ప్రజాప్రతినిధులపైనే ఉంటుంది.

               రాజకీయ పార్టీలు రాజకీయాలు చేయడం సహజం. అది వాటి హక్కు కూడా! అయితే ఎవరు ఏ రాజకీయం చేసినా ప్రజాప్రయోజనాలకు విఘాతం కలగకూడదు. అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు ప్రజలను రెచ్చగొట్టి లబ్ధి పొందడానికి ప్రయత్నించే బదులు వాస్తవాలను తెలుసుకుని వివరించి చెప్పడం బాధ్యతగల మీడియా విధి. భావోద్వేగాలు ఏర్పడినప్పుడు హితోక్తులు చెవికి ఎక్కవు. అయినా గుంపుస్వామ్యంలో పడి ప్రజలు కొట్టుకుపోతున్నప్పుడు వారిని హెచ్చరించడం మీడియా బాధ్యత. ఇలాంటి సందర్భాలలో నిందలు భరించాల్సి కూడా రావచ్చు. అయినా జంక కూడదన్నది నా అభిప్రాయం. అందుకే గతంలో కూడా ఉద్యమించడం కాకుండా, ఏపీ హక్కుల కోసం పోరాడాలని సూచించా. అప్పుడు సమైక్య ఉద్యమంలో కనిపించిన ముఖాలే అటూ ఇటుగా ఇప్పుడు ప్రత్యేక హోదా ఉద్యమంలోనూ కనబడుతున్నాయి. దీన్నిబట్టి ఎవరికి నష్టం జరగబోతున్నదో ప్రజలే తెలుసుకోవాలి. ఇప్పుడు ఏపీ ప్రజలు పోరాడాల్సింది రాని, ఉపయోగం లేని ప్రత్యేక హోదా కోసం కాదు. ప్రకటించిన ప్రత్యేక ప్యాకేజీకి చట్టబద్ధత కల్పించాలని పోరాటం చేయాలి. జల్లికట్టు అనేది ఒక ప్రాంతానికి చెందిన సంప్రదాయం. అందువల్లనే తమిళనాడు ప్రభుత్వం ఆర్డినెన్స్‌ జారీ చేయాలనుకున్నప్పుడు కేంద్ర ప్రభుత్వం సరేనంది. ప్రత్యేక హోదా అలాంటిది కాదు.

               ఈ విషయంలో ఏపీ ఒత్తిడికి కేంద్రం తలొగ్గితే పలు ఇతర రాష్ర్టాలు తమకూ ప్రత్యేక హోదా కావాలని పట్టుబడతాయి. ఆ రాష్ర్టాలలో కూడా కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీకి రాజకీయ ప్రయోజనాలు ఉంటాయి కనుక వాటిని ఫణంగా పెట్టి మన కోరిక తీర్చే అవకాశం ఉండదు. రాజకీయ పార్టీలు కూడా ఏపీ అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని తాత్కాలిక ప్రయోజనాల కోసం నోటికొచ్చినట్టు హామీలు ఇవ్వకుండా స్వీయ నియంత్రణ పాటించాల్సిన అవసరం ఉంది. అవసరానికి హామీలు ఇచ్చి ఆ తర్వాత విస్మరించడం వల్లనే దేశంలో రాజకీయ పార్టీల విశ్వసనీయత దెబ్బతింటోంది. ఆందోళనలు, ఉద్యమాల వల్ల ఏపీ భవిష్యత్తు దెబ్బతింటుంది. సామాజిక సమస్యల పట్ల అవగాహన కలిగి ఉండటంతోపాటు ప్రజలకు మంచి జరగాలన్న చిత్తశుద్ధి ఉన్న పవన్‌ కల్యాణ్‌ రొటీన్‌ తరహా రాజకీయాల నుంచి బయటకు వస్తే ఆయనకే మంచిది. అధికారంలోకి రావడం తనకు ముఖ్యం కాదనీ, ప్రజలకు న్యాయం జరగాలన్నదే తన అభిమతమనీ పవన్‌ తరచుగా అంటూ ఉంటారు. అదే నిజమైతే ఏపీని పట్టి పీడిస్తున్న కుల విద్వేషాలను అరికట్టడానికి ఆయన చొరవ తీసుకుంటే ఏపీ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారు. ఏపీ అభివృద్ధికి ప్రధాన ఆటంకం అక్కడ నెలకొన్న కులతత్వం-– కుల ద్వేషమని నేను గతంలోనే స్పష్టంచేశాను. ఇప్పుడు దాని పర్యవసానాలను కూడా చూస్తున్నాం.

              ఈ నేపథ్యంలో పవన్‌ కల్యాణ్‌ ఈ సమస్య పరిష్కారానికి నడుం బిగించాలని కోరుకుందాం! యువతలో ఆయన పట్ల క్రేజ్‌ ఉంది. దురదృష్టవశాత్తూ యువతలో కూడా కుల జాఢ్యం విస్తరిస్తోంది. చివరకు చిత్ర పరిశ్రమకు కూడా ఇది సోకింది. ఇటీవల విడుదలైన రెండు సినిమాల సందర్భంగా రెండు సామాజికవర్గాలకు చెందిన కొంతమంది యువత అభ్యంతరకర రీతిలో వ్యవహరించడం ఆందోళన కలిగించే అంశం. కళాకారుడికి కులం, మతం, ప్రాంతం ఉండదంటారు. అలాంటిది కళాకారులను కూడా కులం దృష్టితో చూడటం ఒక విషాదం. ఆంధ్రప్రదేశ్‌ను ఈ విషాదం నుంచి బయటపడేయకపోతే నాయకులు బాగానే ఉంటారు గానీ ప్రజలు తీవ్రంగా నష్టపోతారు. తస్మాత్‌ జాగ్రత్త!

             ప్రత్యేక హోదా మాత్రమే కావాలని మంకుపట్టుపట్టి ఉంటే పోలవరం ప్రాజెక్టు కోసం సుమారు 16 వేల కోట్ల రూపాయలు నాబార్డు ద్వారా మంజూరు చేసి ఉండేవారా? తొలి ఏడాది బడ్జెట్‌లో పెట్టినట్టుగా ఏటా వంద కోట్లు లేదా రెండు వందల కోట్లు ఇస్తూ పోయేవారు. అదే జరిగితే ఈ తరమే కాదు వచ్చే తరం కూడా ఆ ప్రాజెక్టు పూర్తికావడాన్ని చూసేది కాదు. ప్రత్యేక హోదా ఉండే రాష్ర్టాలలో విదేశీ ఆర్థిక సహకారంతో చేపట్టే ప్రాజెక్టులు, పథకాల భారాన్ని కేంద్ర ప్రభుత్వమే భరిస్తుంది. హోదా ప్రకటించక పోయినా ఏపీకి ఈ వెసులుబాటు ఇస్తున్నట్టు కేంద్రం ప్రకటించింది. ఈ వెసులుబాటును ఉపయోగించుకుని ఏపీలో పలు ప్రాజెక్టులకు రూపకల్పన చేసి కేంద్రం ఆమోదం పొందడానికి కృషి చేయాలే గానీ హోదా ఇస్తే చాలు అని ప్రజలను తప్పుదారి పట్టించడం సమర్థనీయం కాదు. హోదా ఇచ్చినా విదేశీ ఆర్థిక సహాయంతో చేపట్టే ప్రాజెక్టులకు కేంద్రం ఆమోదం తెలపకపోతే ఏమిటి పరిస్థితి?

ఏపీ అభివృద్ధికి ప్రధాన ఆటంకం అక్కడ నెలకొన్న కులతత్వం- కులద్వేషమని నేను గతంలోనే స్పష్టంచేశాను. ఇప్పుడు దాని పర్యవసానాలను కూడా చూస్తున్నాం. ఈ నేపథ్యంలో పవన్‌ కల్యాణ్‌ ఈ సమస్య పరిష్కారానికి నడుం బిగించాలని కోరుకుందాం

India's foodgrain production increases to 252.23 mmtS

India's foodgrain production increases marginally to 252.23 million tonnes in 2015-16 crop year
By Madhvi Sally, ET Bureau | Updated: May 09, 2016, 08.19 PM IST

NEW DELHI: India's foodgrain production increased marginally to 252.23 million tonnes in the 2015-16 crop year, as per the third advance estimates, despite setback due to deficient rainfall and shortage of water in reservoirs.

Production of rice, coarse cereals,pulses, oilseeds, sugarcane ,cotton and jute was lower due to erratic rainfall during the 2015 monsoon season.

"As per the 3 rd advance estimates for 2015-16 total foodgrains production in the country has been higher than that in the last year. Total foodgrains production during 2015-16, estimated at 252.23 million tonnes, has been higher by 0.21 million tonnes over the production of 252.02 million tonnes during 2014-15," the ministry said in a release.

Rice production during 2015-16 is estimated at 103.36 million tonnes, which is lower by 2.12 million tonnes than its production of 105.48 million tonnes during 2014-15.

Production of wheat estimated at 94.04 million tonnes is higher by 7.51 million tonnes than the production of 86.53 million tonnes of wheat during 2014-15. Total production of coarse cereals is estimated at 37.78 million tonnes which is lower by 5.08 million tonnes as compared to their production of 42.86 million tonnes during 2014-15.

Output of pulses is estimated at 17.06 million tonnes during 2015-16, marginally lower than the previous year's production of 17.15 million tonnes.

With a decline of 1.6 million tonnes over the previous year's production's total oilseeds production in the country during 2015-16 is estimated at 25.9 million tonnes.

Production of sugarcane estimated at 346.72 million tones, is lower by 15.61 million tonnes than its production during 2014-15.

Production of Cotton estimated at 30.52 million bales (of 170 kg each) is also lower by 4.28 million bales than its production of 34.805 million bales during 2014-15.

Production of jute is estimated at 9.92 million bales (of 180 kg each) which is lower by 0.70 million bales than its production of 10.62 million bales during 2014-15.















Friday, 27 January 2017

సబ్సిడీపై 15 వేల ట్రాక్టర్లు!

సబ్సిడీపై 15 వేల ట్రాక్టర్లు!
28-01-2017 01:39:35

వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఇచ్చే యోచన: పోచారం

హైదరాబాద్‌, జనవరి 27 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో వచ్చే ఆర్థిక సంవత్సరంలో రైతులకు 10 నుంచి 15 వే ల సబ్సిడీ ట్రాక్టర్లను ఇవ్వాలనే యోచనలో ప్రభుత్వం ఉందని మంత్రి పోచారం శ్రీనివా్‌సరెడ్డి తెలిపారు. ఈ ట్రాక్టర్లకు సబ్సిడీ పోను.. మిగిలిన మొత్తాన్ని లబ్ధిదారుకు రుణంగా సహకార బ్యాంకులే సమకూర్చాలన్నారు. శుక్రవారం టెస్కాబ్‌ ప్రధాన కార్యాలయంలో డీసీసీబీ చైర్మన్లు, జిల్లా సహకారశాఖ అధికారుల (డీసీవోల)తో మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వ్యవసాయ, సహకార శాఖలు ఒకే గొడుగుకింద పనిచేయా ల్సి ఉందన్నారు. రాష్ట్రంలోని అనేక సొసైటీల ద్వారా రైతులకు సేవలు పొందే భాగ్యం లభించడంలేదని, అధ్యక్షులు, సీఈవోలూ లేకుండా తాళాలు వేసుంటున్నాయన్నారు. వ్యవసాయ యాంత్రీకరణలో బయటి దేశాలకు బదులుగా.. రాష్ట్రంలో యూనిట్లను ఏర్పాటు చేస్తున్న మహీంద్రా వంటి సంస్థలకు ప్రాధాన్యం ఇవ్వాల్సిందిగా సీఎం సూచించారన్నారు. కాగా, రైతులు సేంద్రియ వ్యవసాయంవైపు మళ్లాల్సిన అవసరం ఉందని మంత్రి అన్నారు. హాకా భవనలో రాష్ట్ర సేంద్రియ ధ్రువీకరణ అథారిటీని ప్రారంభించిన ఆయన ఉత్పత్తులపై అవగాహనకు సంబంధించిన పోస్టర్‌, కరపత్రాలు, సీడీలను ఆవిష్కరించారు.

Tuesday, 10 January 2017

గురివిందలు సిగ్గుపడుతున్నాయి!

గురివిందలు సిగ్గుపడుతున్నాయి!
10-01-2017 01:44:53

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పోలవరం నిర్మాణం చేపట్టి వేగంగా పూర్తిచేయడానికి తీవ్ర కృషి చేస్తుండటంతో ఈ ప్రాజెక్టు పూర్తయితే తమకు పుట్టగతులు వుండవన్న దురుద్దేశంతో పెద్ద కాంగ్రెసు, చిన్న కాంగ్రెస్ వారు ఆక్రోశం, ఆవేదన, అసహనంతో బాధపడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వంపై నిందలు వేస్తున్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే వారు స్వార్థ వ్యాధితో బాధపడుతున్నట్లు అర్థమవుతుంది. పోలవరం పూర్తవుతుందేమోనని నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు వారు. కమీషన్ల కోసం లాలూచి పడి పోలవరం ప్రాజెక్టు రాష్ట్ర ప్రభుత్వం నిర్మించేలా కేంద్రంపై చంద్రబాబు ఒత్తిడి తెచ్చారు అంటూ కేవీపీ రామచంద్రరావు విమర్శించడం సిగ్గుచేటు.

ఆనాటి జలయజ్ఞం దోపిడీలో అప్పటి ప్రభుత్వ సలహాదారు కేవీపీ రామచంద్రరావుదే ప్రధాన పాత్ర. అసలు కమీషన్ల కోసమే జలయజ్ఞం చేపట్టి అవినీతి యజ్ఞం చేసి రాష్ట్రం పుట్టి ముంచిందే కేవీపీ రామచంద్రరావు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి, కేవీపీ రామచంద్రరావు మధ్య సంబంధాలు ప్రపంచమంతటికీ తెలుసు. అట్లాగే ప్రాజెక్టుల పేరుతో వేలకోట్లు దోచుకున్న దొంగలంతా అవినీతిపై ప్రాజెక్టుల వద్ద బహిరంగ చర్చలు జరపాలంటూ లేఖలు రాయటం సిగ్గుచేటు. మేఘమథనం పేరుతో రూ.128కోట్ల ధనమథనం చేసిన పెద్దమనిషి రఘువీరారెడ్డి కూడా అవినీతిపై మాట్లాడటం విడ్డూరం. వీరి లేఖలతో వారు చేసిన పాపాలన్నీ ప్రక్షాళనై జనం పక్షపాతిగా మారారని జనం నమ్ముతారనే భ్రమల్లో వున్నారు వీరు. చందాలు, వసూళ్లు, కాంట్రాక్టులు, బదిలీలు, నియామకాలు, భూకేటాయింపులు ఇలా ఒకటేంటి అన్నిటిలో వైఎస్‌కి, కేవీపీ రామచంద్రరావు బినామీ అని ప్రపంచానికి తెలుసు. జలయజ్ఞం దారి తప్పటానికి కేవీపీ రామచంద్రరావు, జగన్‌లే సూత్రధారులు, పాత్రధారులు. వీరిద్దరి అత్యాశ వల్లనే వేలకోట్ల ప్రజాధనం దోపిడీ అయి ప్రాజెక్టులు రెండు తెలుగు రాష్ట్రాలకు గుదిబండలుగా మారాయి. జలయజ్ఞం చేపట్టి అదిగో హరితాంధ్రప్రదేశ్గా రాష్ట్రం కాబోతుంది అంటూ రైతుల్ని మభ్యపెట్టారు.

ప్రజల్ని పరిపాలించే వారికి ప్రజా దృక్పథం వుండాలి. అలా కాకుండా నిలువెల్లా స్వార్థంతో రూపకల్పన చేసిన జలయజ్ఞంలో జరిగిన దారుణాలు అన్నీ ఇన్ని కావు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి చేపట్టిన జలయజ్ఞం అవినీతి జలగలపాలిట పడి ఎలా భ్రష్టుపట్టిందో తెలుగు ప్రజలందరికీ తెలుసు. తడి గుడ్డతో రైతాంగం గొంతు కోసే దుస్తంత్రాన్ని ఆనాటి ముఖ్యమంత్రి నిష్టగా పట్టాలు ఎక్కించారు. కోటి ఎకరాల జలయజ్ఞం అంటూ ఆశపెట్టి ఆవిష్కరించిన సుందర స్వప్నం కేవలం కలగానే మిగిలిపోయింది. జలయజ్ఞంపై చెప్పిన గొప్పలన్నీ, ప్రకటనలన్నీ నీటి మూటలుగానే మిగిలాయి. నీరు దేవుడు ఎరుగు, నిజం ప్రాజెక్టులు ఎరుగు అన్న చందంగా మార్చారు. ప్రజాధనాన్ని యథేచ్ఛగా దోచుకోవడానికి అత్యంత అనువైన పథకంగా జలయజ్ఞాన్ని ఎంపిక చేసుకున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో వివిధ ప్రాజెక్టుల నిర్మాణం కోసం రైతుల నుంచి 7లక్షల ఎకరాలు సేకరించినా దాదాపు రూ.85వేల కోట్ల రూపాయలు ప్రజాధనం ధారపోసినా జలయజ్ఞం వల్ల ఒరిగిందేమిటి? లక్ష్యం ఎంత పవిత్రమైనది అయినా అమలు చేయటంలో స్వార్థం చోటుచేసుకుంటే అది నిరుపయోగమే. అప్పుడు అదే జరిగింది.

జలయజ్ఞంలో వైఎస్ తీసుకున్న విధాన నిర్ణయాలన్నీ కాంట్రాక్టర్ల ప్రయోజనమే పరమార్థంగా మార్చారు. ఎప్పటికప్పుడు వ్యయ అంచనాలు పెంచుకునేందుకు కల్పించిన వెసులుబాటు కాంట్రాక్టర్లకు కనక వర్షం కురిపించింది. రైతుల ప్రయోజనాల కన్నా గుత్తేదారులకు పనుల అప్పగింతే ముఖ్యం అన్నట్లు ప్రభుత్వం కథ నడిపించింది అని కాగ్ నివేదికలు తూర్పార పట్టాయి. ప్రాజెక్టులను సరైన ప్రణాళిక లేకుండానే చేపట్టారని కంప్ర్టోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ప్రాజెక్టుల పరిశీలనలో వెల్లడైంది. రాష్ట్ర ప్రభుత్వం జలయజ్ఞం పేరుతో చేసిన ఖర్చుకి, వచ్చిన ఫలితాలకు అసలు పొంతనే లేదని 2011 ఏప్రిల్ 19న ప్రణాళికా సంఘం అసంతృప్తి వ్యక్తంచేసింది.

కాంట్రాక్టులు కేటాయింపులో ప్రభుత్వ పనితీరు ఉగాండా నియంత ఇడీ అమీన్‌ను తలపిస్తుందని 2010 జూన్10న హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రజల డబ్బుతో చేపట్టే పనులను ఇష్టం వచ్చినట్లు నచ్చినవారికి కట్టబెట్టడం సరికాదని సుప్రీంకోర్టు, హైకోర్టు పలుమార్లు అక్షింతలు వేశాయి. నిర్మాణంలో గాడి తప్పిన వ్యయం, నిర్మాణంలో నత్త నడక, అవధులు లేని అవినీతి, నిర్మాణంలో కనపడని నాణ్యత ఇవన్నీ సాగునీటి ప్రాజెక్టుల మౌలిక లక్ష్యాన్నే దెబ్బతీస్తున్నాయి అని ప్రపంచ బ్యాంకు రహస్య నివేదిక ఆనాడే హెచ్చరించింది. ప్రాజెక్టుల విషయంలో పూర్తిస్థాయి సర్వే ఇన్వెస్టిగేషన్లను చేసి డిజైన్లను రూపొందించే బాధ్యతను కాంగ్రెస్ ప్రభుత్వం గుత్తేదారులకే అప్పగించడం అందర్నీ విస్మయానికి గురిచేసింది. డిజైన్ల ఆమోదంలో కాంట్రాక్టర్లకు పూర్తిగా వంత పాడింది ప్రభుత్వం. అడ్డుపడిన ఇంజినీర్లను అడ్డు తొలగించారు.

జలయజ్ఞం తలపెట్టిన నాడే ప్రాధాన్యతా క్రమంలో ప్రాజెక్టులు చేపట్టాలని, స్థాయికి తగినట్లు వనరులు అంచనా వేసి నిర్మాణం చేపట్టాలని, మేధావులు, నిపుణులు, ఇంజనీర్లు, ప్రతిపక్షాలు సలహాలిచ్చాయి. దాన్ని అధికారపార్టీ నాయకులకు, కాంట్రాక్టర్లకు ఆదాయ వనరుగా మార్చారు. పదేళ్ల పాటు ఖరీఫ్‌ల మీద ఖరీఫ్‌లు వచ్చి పోయాయి, వేలకోట్లు కరిగిపోయాయి తప్ప కాల్వల్లో నీరు పారలేదు, సాగునీటి కోసం ఎదురుచూసిన రైతుల కన్నీరు ఆరలేదు, చుక్క నీరు పొలాల్లోకి జారలేదు. పోలవరం ప్రాజెక్టులో అంచనాలు పెంచారని గగ్గోలు పెడుతున్నారు. కానీ నేడు ప్రాజెక్టు వ్యయం పెరగటానికి కారణం ఇప్పటి ధరలకు అనుగుణంగా అంచనా వేయటం వల్లనే. ఆనాడు సమగ్ర విధానాలు, పక్కా ప్రణాళికలు లేకుండా రాత్రికిరాత్రి అంచనాలు పెంచేసి రాజమార్గాన ప్రజాధనాన్ని దోచేశారు. నిధులు స్వాహా చేయాలన్న ఆరాటం తప్ప రాష్ట్ర ప్రయోజనాలు పట్టించుకోలేదు. రైతు ప్రయోజనాల పేరిట వైఎస్ ప్రభుత్వం నిర్ణయాల వెనుక జరిగిందంతా స్వార్థ ప్రయోజనమే.

విద్యుత్ వ్యవస్థ కుప్పకూలటం, రాష్ట్రం చీకటి కావటం, పారిశ్రామిక రంగం పతనం కావటం, నిరుద్యోగం పెరగటం, గ్రామీణ ప్రాంతాలు జీవం కోల్పోవటానికి పదేళ్ళ కాంగ్రెస్ పరిపాలన కాదా? వ్యవసాయ సంక్షోభం, రైతు ఆత్మహత్యలు పెరగటానికి, అంతులేని అవినీతితో రాష్ట్రం దోపిడి కావటానికి, ప్రజాస్వామ్య వ్యవస్థలు, రాజ్యాంగ వ్యవస్థలు ధ్వంసం కావటానికి కాంగ్రెస్ వారు కారణం కాదా? సమస్త సంపదను దోచేసి నేడు నిజాలకు తూట్లు పొడుస్తున్నారు.

అధికారం లేకపోతే ఆదర్శాలు గుప్పించడం, అధికారంలో వుంటే అవినీతి, అరాచకం, అవకాశవాదం కాంగ్రెస్ పార్టీ చరిత్ర. అందుకే ప్రాజెక్టుల పేరిట వారు ఎన్ని విన్యాసాలు చేసినా ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. పదేళ్ల కాంగ్రెస్ పాలకుల ప్రజా వ్యతిరేక విధానాలు రైతుల్ని క్రుంగదీశాయి. వారు ఎన్ని లేఖలు రాసినా వారిని దయామయులుగా జనం గుర్తించరు. పోలవరం నిర్మాణం వేగం అందుకోవడంతో అది 2018నాటికి పూర్తయితే తమ పుట్టి మునగటం ఖాయం అన్న భయంతో తల్లి కాంగ్రెస్ వారు, పిల్ల కాంగ్రెస్ ప్రభుత్వంపై అహేతుక విమర్శలకు తెగబడుతున్నారు. మీ కువిమర్శలు ఇప్పటికైనా మానండి, ప్రజాభ్యుదయం కోసం ప్రాజెక్టులకు అడ్డుపడకండి, ప్రభుత్వానికి సహకరించండి.
-దేవినేని ఉమా మహేశ్వరరావు
జలవనరుల శాఖామాత్యులు.

Monday, 9 January 2017

‘సాగుబడి’లో కెనడా విద్యార్థులు

‘సాగుబడి’లో కెనడా విద్యార్థులు
10-01-2017 11:45:07

గన్నారంలో ‘నవారా’ వరి సాగు పరిశీలన
సేంద్రియ సాగు పద్ధతులపై ప్రశంసలు
రాయపర్తి (వరంగల్‌రూరల్‌ జిల్లా)
మండలంలోని గన్నారం గ్రామంలో సేంద్రీయ పద్ధతిలో సాగు చేస్తున్న పంటలను కెనడా దేశానికి చెందిన విద్యార్థులు సోమవారం పరిశీలించారు. బాలవికాస స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో సేంద్రీయ పద్ధతిలో వ్యవసాయం చేస్తున్న తీరును తెలుసుకోవడానికి విదేశీయులు గ్రామానికి రావడంతో రైతులు ఎడ్లబండ్లలో ఎక్కించుకుని డప్పువాయిద్యాలతో ఆహ్వానించారు. అనంతరం రైతు విశ్వేశ్వర్‌రెడ్డి సాగు చేసిన వ్యవసాయ క్షేత్రాన్ని పరిశీలించారు. సేంద్రీయ ఎరువులతో వరి, పత్తి, మామిడి తోటలను ఎలా సాగు చేశారో తెలుసుకున్నారు. భూసారం పెంచేందుకు రసాయన రహిత ఎరువుల తయారీ విధానాన్ని రైతులు చూపించారు. సేంద్రీయ సాగుకు పేడ, ఆవు మూత్రం, వావిలాకు, పొగాకు, వేపకాయలు, పప్పులు, తౌడు, కారం, బెల్లం, మట్టి తదితర ద్రావణాలతో ఏ సాగుకు ఎంత మోతాదులో చేయాలో తెలుసుకుని వాటిని నోట్‌ చేసుకున్నారు. కెనడా విద్యార్థులు సైతం రైతులు తయారుచేసే సేంద్రీయ ఎరువును ఎంతో ఆసక్తిగా చూసి కెమెరాల్లో బంధించారు.

ఆర్థిక చేయూత అందిస్తాం: విదేశీ విద్యార్థులు
వ్యవసాయ క్షేత్రంలో జరిగిన సమావేశంలో కెనడా దేశస్థులు జనీతా, మార్టీనా, డానిష్‌ మా ట్లాడుతూ బాలవికాస సంస్థ అందిస్తున్న సూచనలు రైతులు నూటికి నూరుశాతం పాటించి సేం ద్రీయ ఆహార ఉత్పత్తులను పెంచడం అభినందనీయమన్నారు. సంపూర్ణ ఆరోగ్యం కోసం సేం ద్రీయ ఆహారం తీసుకోవాలనే లక్ష్యంతోనే తాము ఆర్థిక సహాయం అందిస్తున్నామని తెలిపారు. ప్రపంచ దేశాలు రసాయన ఎరువులను తగ్గించి సేంద్రీయ ఎరువులతో పండించిన ఆహారం తీసుకున్నప్పుడే ఆరోగ్యవంతమైన సమాజం ఏర్పడుతుందన్నారు. సేంద్రీయ సాగును ప్రతీ ఒక్కరు ప్రోత్సహించి పాటించాలని కోరారు.

సాగు భేషుగ్గా ఉంది
గ్రామంలో కెనడా విద్యార్థుల బృందం మాట్లాడుతూ విశ్వేశ్వర్‌రెడ్డి సాగు చేసిన నవారా వరి వంగడం సాగు సేంద్రీయ ఎరువులతో చేయడం చాలా బాగుందని కితాబిచ్చారు. నవారా సాగులో అధిక దిగుబడి రావడంతో రైతులకు ఎంతో మేలు జరుగుతుందని అన్నారు. ఈ విధానాన్ని తమ దేశంలో పాటించే విధంగా రైతులకు అవగాహన కల్పిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ బెల్లి యాదమ్మ, బాలవికాస ప్రోగ్రాం అధికారి తిరుపతి, కో ఆర్డినేటర్‌ లింగారావు, రాజ్‌కుమార్‌, మురళీ, కిరణ్‌, రాంబాబు, తిరుపతి, రైతులు తదితరులు పాల్గోన్నారు.

జల గండం


ప్రణాళిక లేకపోతే.. జల గండం
10-01-2017 06:52:20
ఆంధ్రజ్యోతి - విజయవాడ: నిర్ధిష్ట ప్రణాళిక ప్రకారం ప్రాజెక్టులను పూర్తి చేయ కపోతే రాష్ట్రానికి జలగండం పొంచి ఉందని రైతాంగ సమాఖ్య ఆధ్వర్యంలో విజయవాడ ఎగ్జిబిషన్‌ సొసైటీ హాలులో నిర్వహించిన చర్చావేదికలో పాల్గొన్న వక్తలు అభిప్రాయ పడ్డారు. రైతాంగ సమాఖ్య అధ్యక్షుడు ఎర్నేని నాగేంద్రనాథ్‌ మాట్లాడుతూ గోదావరి నది నీటి కేటాయింపులపై స్పష్టత, ఆ నదిపై కడుతున్న ప్రాజెక్టులు, ఏపీలో కడుతున్న ప్రాజెక్టులపై ప్రభుత్వాలు వివరణ ఇవ్వాల్సి ఉందన్నారు. కృష్ణానదిపై శ్రీశైల జలాశయం నుంచి తెలంగాణా ప్రభుత్వం 150 టీఎంసీల నీటిని ఎత్తిపోతల ద్వారా పాలమూరు- రంగారెడ్డి, దిండి ఎత్తిపోతల పథకాలు, గోదావరిపై గల ప్రాజెక్టులను రీ డిజైన్‌ చేసి 500 టీఎంసీల నీటిని దిగువ నుంచి ఎగువ కు పంప్‌ చేయడానికి కార్యాచరణ చేసింద న్నారు. బడ్జెట్‌లో రూ.15 వేల కోట్లు కేటా యించారని, దీంతో ఏపీలో ఇప్పటికే ఉన్న నీటి కొరత సమస్య ఇంకా జఠిలమవుతుంద ని తెలిపారు. ఎగువ రాష్ట్రాలైన మహారాష్ట్ర, కర్నాటకలకు బచావత కేటాయించిన 1320, బ్రిజేష్‌ కుమార్‌ కేటాయించిన 1573 టీఎంసీ లకు మించి అనుమతిలేని అక్రమ ప్రాజెక్టుల ను నిర్మించి 700 నుంచి 800 టీఎంసీ నీటి వినియోగానికి చర్యలు చేపట్టినట్లు తెలిపా రు. తుంగభద్ర ద్వారా రాయలసీమకు కేటాయించిన 94 టీఎంసీలకు 75 టీఎంసీలు వినియోగంలోకి వస్తున్న సమయంలో తుంగ భద్ర ప్రాజెక్టుపై 40 టీఎంసీల అదనపు కేటా యింపు వల్లనీటి కొరత పెరుగుతుందని చెప్పారు. కొయినా, అల్మట్టిలకు 185 టీఎంసీ లు అదనంగా కేటాయించడం వల్ల కృష్ఱానది కి నీటి చేరిక తగ్గి రెండు తెలుగు రాష్ట్రాలు నష్టపోయే అవకాశం ఉందని చెప్పారు. మిగులు జలాల ఆధారంగా తెలంగాణలో నిర్మాణంలో ఉన్న నెట్టెంపాడు, కోయిల్‌సాగర్‌, కల్వకుర్తి, శ్రీశైలం ఎడమగట్టు కాల్వ ఏఎంఆ ర్‌ ప్రాజెక్టులకు 105 నుంచి 110 టీఎంసీలు నీరు కావాల్సి ఉందన్నారు. 120 సంవత్సరా లుగా ఉన్న డెల్టా ఆయకట్టుకు 156 టీఎంసీ లు అవసరమని చెప్పారు. సాగర్‌ నుంచి దీని కోసం 76 టీఎంసీలు మాత్రమే వస్తున్న దని, మిగిలిన 80 టీఎంసీలు సాగర్‌కు దిగు వన ఉన్న వనరుల నుంచే నీరు వస్తుందని చెప్పారు. బచావత, బ్రిజేష్‌ ట్రిబ్యునళ్ళు కేటా యించిన నీటిలో ఏపీలో మేజర్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టులకు 479 టీఎంసీలు, మైనర్‌ ఇరిగేష న్‌కు 42 టీఎంసీలు, తెలంగాణాలో మేజర్‌ ఇరిగేషన్‌కు 172, మీడియం, మైనర్‌ ఇరిగేష న్‌కు 122 టీఎంసీల కేటాయింపులు ఉన్న విషయాన్ని గమనించాలన్నారు. కేటాయింపు ల కన్నా అదనపునీటి వినియోగాన్ని వెంటనే నిలిపివేయాలన్నారు. పులిచింతల వద్ద రివ ర్స్‌బుల్‌ టర్బయిన్లను ఏర్పాటు చేయాలని చెప్పారు. ప్రకాశం బ్యారేజీ- పులిచింతల మధ్య 89 కిమీ దూరంలో రెండు బ్యారేజీలు నిర్మించి 57 అడుగుల జలాశయంలోకి ఎత్తిపోయాల్సి ఉంటుందన్నారు.

పోలవరంపై అసత్య ప్రచారాలు
పోలవరానికి కేంద్రం ఇచ్చిన చెక్కు యావత్తు జాతీయ ప్రాజెక్టులకు ఇచ్చిన దిగా ఉందని, పోలవరంపై అసత్య ప్రచారాలు సాగుతున్నాయని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణకుమార్‌ తెలిపారు. ప్రాజెక్టుల విష యంలో ఎవరు చెప్పినా ప్రభుత్వం వినడం లేదని చెప్పారు, ప్రాజెక్టుల విషయంలో కోర్టులకు వెళ్ళడం అనవసరమని, అవి ఎప్ప టికి తేలుతాయో తెలియదని, ప్రభుత్వానికి అనుకూలంగానే ఇప్పుడు కోర్టులు కూడా వ్యవహరిస్తున్నాయని చెప్పారు. కాంగ్రెస్‌ నాయకుడు తులసిరెడ్డి మాట్లాడుతూ ఆయా ప్రాజెక్టుల వద్ద ఉన్న ప్రస్తుత పరిస్థితులను గణాంకాలతో వివరించారు. బీజేపీ రైతు సంఘం నాయకుడు పూడి తిరుపతిరావు మాట్లాడుతూ, తాము ప్రభుత్వంలో ఉన్నట్లా, లేనట్లా అనేది తేల్చుకోలేక పోతున్నామని, ప్రభుత్వం అటు ప్రతిపక్షాల మాటగాని, ఇటు ప్రజా సంఘాల మాట గాని పరిగణనలోకి తీసుకోవడం లేదన్నారు. రాయలసీమకు చెందిన ఇరిగేషన్‌ మాజీ ఇంజనీర్‌ నాగిరెడ్డి మాట్లాడుతూ, సాగునీటి ప్రాజెక్టుల విషయంలో రాయలసీమకు తీవ్ర అన్యాయం జరుగుతుందని తెలిపారు. పోల వరం విశ్రాంత ఎస్‌ఈ హరనాథ్‌ మాట్లాడు తూ ప్రాజెక్ట్‌కు వేసిన అంచనాలకన్నా మించి అంచనాలు ఇప్పుడు ఉన్నాయని, దీనిపై అనేక సందేహాలు ఉన్నాయని చెప్పారు. ఈ సమావేశంలో రైతు సమాఖ్య నాయకుడు కుమారస్వామి, పలువురు రైతు నాయకులు, విశ్రాంత ఎస్‌ఈలు పాల్గొన్నారు.

తీర్మానాలు ఇవి..
సమావేశంలో పలు తీర్మానాలు చేశారు. పోలవ రం 2019లో పూర్తి చేస్తుండగా పురు షోత్తమ పట్నం ఎత్తిపోతల అవసరం లేదని, పట్టిసీమ ద్వారా ప్రకాశం బ్యారేజీకి 50 టీఎంసీల నీటిని పంపి, పులిచింతల నీటిని కూడా సద్వినియోగ పరచుకునేలా చర్యలు తీసుకోవాలని తీర్మానాలు చేశారు. పోలవరం నుంచి గ్రావిటీ ద్వారా నీరు ఇస్తామని, ప్రాజెక్టును పూర్తి చేస్తామని ప్రకటించి నందుకు హర్షం వ్యక్తం చేస్తూనే భూసేకరణ, ఉపాధి, పునరావాసం, హెడ్‌వర్క్స్‌లో ఐదుకోట్ల క్యూబిక్‌మీటర్ల నెట్‌వర్క్‌, 37 లక్షల క్యూబిక్‌మీటర్ల కాంక్రీట్‌ వర్క్‌, స్పిల్‌వే, 40 గేట్ల నిర్మాణం, రాక్‌ఫిల్‌డ్యామ్‌ నిర్మాణం, అలాగే రూ. 30 వేల కోట్ల నిధుల సమీకరణ వంటి విషయాలపై పలువురు అనుమానాలను వ్యక్తం చేశారు. సాగర్‌లో నీరు ఉన్నా కూడా ఇవ్వలేని పరిస్థితిపై సమావేశం ఆందోళన వ్యక్తం చేసింది.